ప్రకాష్ రాజ్ ని పీకేస్తున్న కొరటాల శివ

ఇదేమి కొత్త కాదు.గతంలో ఎన్నోసార్లు ప్రకాష్ రాజ్ మీద ఎన్నో కంప్లయింట్స్ వచ్చాయి.

సెట్స్ కి సరిగా రారని, ఏ రోజు వస్తారో, ఏ రోజు రారో చెప్పలేమని, డేట్స్ మీద సరిగా నిలబడరని, అంతేకాదు, ఎక్కువ టెక్స్ చేయమంటే చేయరని, చివరకి డైలాగులు కూడా మార్చేస్తారని .ఇలా ప్రకాష్ రాజ్ మీద ఎన్నో కంప్లయింట్స్ ఉన్నాయి.ఓ దశలో ఆయన మీద బ్యాన్ వేసే దిశగా కాలు కదిపింది తెలుగు ఇండస్ట్రీ.

అందుకే కొంతకాలం ప్రకాష్ రాజ్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.నిర్మాతలు, దర్శకులు ఆయనతో విసిగిపోయారు.

కాని చిన్న మార్పు కనిపించింది ప్రకాష్ రాజ్ లో.అప్పటినుంచి మళ్ళీ తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చేసారు.కాని ఆ మార్పు ఎంతోకాలం నిలవలేదు.

Advertisement

మళ్ళీ టార్చర్ చేయడం మొదలుపెట్టారు ప్రకాష్ రాజ్.మళ్ళీ షూటింగ్ కి లేట్ గా రావడం, ఒక్కోసారి రాకపోవడం .ఈ తంతు మళ్ళీ మొదలైంది.ఈసారి నష్టపోయిందో ఎవరు తెలుసా ? మహేష్ బాబు - కొరటాల శివ.స్పైడర్ లేట్ అవడం వలన బేసిక్ గానే భరత్ అనే నేను అనుకున్న సమయం కన్నా ఆలస్యంగా మొదలైంది.మహేష్ ఓవైపు స్పైడర్, ఓవైపు భరత్ అనే నేను చేసుకుంటూ, రెండు షిఫ్టుల్లో పనిచేసాడు కొన్నిరోజులు.

కొరటాల సినిమా షెడ్యూల్ కోసం స్పైడర్ డబ్బింగ్ డేట్స్ కూడా మార్చుకున్నాడు.షూటింగ్ కి వెళితే ప్రకాష్ రాజ్ ఆరోజు తన సీన్ ఉన్న రాలేదు.మహేష్ - కొరటాల .ఇద్దరికీ కోపం వచ్చింది.మళ్ళీ ఆరోజు ఉన్నవారందరి డేట్స్ ఒకేరోజు కుదరాలి అంటే ఎంత కష్టం ? ఒక్కసారి అంటే అడ్జస్ట్ అవుతారు.కాని మళ్ళీ ప్రకాష్ రాజ్ అదే పని చేసారు.

దాంతో హైదరాబద్ షెడ్యూల్ లో మార్పులు చేసి లక్నో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది యూనిట్.ఇక ప్రకాష్ రాజ్ వద్దు.

ఇలాగైతే ఇప్పటికే ఆలస్యం అయిన సినిమా ఇంకా ఆలస్యం అవుతుంది అని కొరటాల ఫిక్స్ అయిపోయారట.సినిమాలోంచి ప్రకాష్ రాజ్ ని తీసేస్తున్నట్లు సమాచారం.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

మరి అయన స్థానంలోకి ఎవరు వస్తారో చూడాలి.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి పాటలో కనిపిస్తాడు.

Advertisement

బాలివుడ్ భామ కైరా అద్వాని సూపర్ స్టార్ సరసన ఆడిపాడనుండి.భరత్ అనే నేను సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల అయ్యే అవకాశాలున్నాయి.