మహేష్ సినిమా నుంచి జగపతి అవుట్

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే.

అయితే సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే నటీనటుల లిస్ట్ లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది.

సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ఒప్పుకున్నా జగపతిబాబు సినిమాలో నుంచి తప్పుకున్నట్లు టాక్.

సరిలేరు నీకెవ్వరూలో విజయశాంతి కూడా కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆమెతో సమానంగా ఉండే మరో క్యారెక్టర్ కోసం దర్శకుడు అనిల్ జగ్గు భాయ్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.కానీ కొన్ని కారణాల వల్ల జగపతి బాబు సినిమా నుంచి తప్పుకోవడంతో స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ని ఆ పాత్ర కోసం ఎంచుకున్నట్లు సమాచారం.

జగపతి బాబు ఆ పాత్ర నచ్చక తప్పుకున్నారా? లేక చిత్ర యూనిట్ తో విబేధాల వల్ల తప్పుకున్నారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.ఈ విషయం వైరల్ అవ్వకముందే చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తే బావుంటుంది.అనిల్ సుంకర - దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Advertisement
50లోనూ యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

తాజా వార్తలు