కొడుకులను పోగొట్టుకున్న బాధలో ఉన్న భార్యలకు విడాకులు ఇచ్చారు ఈ స్టార్ యాక్టర్స్

చిత్ర పరిశ్రమలోని ఎంతోమంది సెలబ్రిటీలను మన పూజిస్తాం, అభిమానిస్తాం అయితే వాళ్ళు మనుషులేగా, వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా.

సో, ఈరోజు మనం రీల్ లైఫ్ లో సక్సెస్ అందుకొని రియల్ లైఫ్ లో బాధలు పడ్డ, రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న, రక్తం పంచుకొని పుట్టిన పిల్లల్ని కోల్పోయిన కొంతమంది సెలబ్రిటీల గురించి మాట్లాడుకుందాం.

ఈ లిస్ట్ లో ముందు వరసలో ఉన్నారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు.ఈయన రీల్ లైఫ్ ఎంత పెద్ద నటులో మనందరికి తెలిసిందే.

అంతేకాదు ప్రకాష్ రాజ్ గారు మేహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకొని సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.అయితే ఈయన 1994లో లలిత అనే అమ్మాయిని వివాహం చేసుకొని ఇద్దరు అమ్మాయిలు అండ్ ఒక అబ్బాయికి జన్మనిచ్చారు.

అయితే 2004 సంవత్సరంలో ప్రకాష్ రాజ్ కొడుకు గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు మరణించాడు.అలా ప్రకాష్ రాజ్ గారి జీవితంలో తన అయిదేళ్ల కొడుకును పోగొట్టుకోవడం ఆయనకు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.

Advertisement
Prakash Raj And Prabhu Deva Divorce Similarities , Prabhu Deva, Prakash Raj, Nay

ఇక ఆతర్వాత కొన్నాళ్ళకు తన భార్య అయిన లలితతో అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.అలా 2012 లో లలిత.

ఉన్న కొడుకుని పోగొట్టుకొని, ప్రకాష్ రాజ్ తో విడిపోయి ఇప్పటికి ఎన్నో బాధలు పడుతుంది.కానీ ప్రకాష్ రాజ్ మాత్రం రెండో పెళ్లిచేసుకొని ఇప్పుడు సంతోషంగానే ఉంటున్నారు.

Prakash Raj And Prabhu Deva Divorce Similarities , Prabhu Deva, Prakash Raj, Nay

ఇక ఇండియన్ టాప్ డాన్సర్ అయినా ప్రభుదేవా గారు కూడా ప్రియురాలి కోసం ఉన్న ఫ్యామిలీని వదలేసాడట.తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయినా హాట్ బ్యూటీ నయనతార అండ్ ప్రభుదేవా ఒకరినిఒకరు ప్రేమించుకొని పెళ్లికూడా చేసుకుందామనుకున్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే వీళ్ళ ప్రేమ ఎంతవరకు వెళ్లిందంటే ప్రభుదేవా అప్పటికే ఉన్న తన భార్యని దూరం పెట్టేస్తే.

నయనతార ఇక సినిమాలు చేయనని ప్రభుదేవాని పెళ్లిచేసుకొని సెట్టిల్ అయిపోతానని స్టేట్మెంట్స్ ఇచ్చేసింది.అలా ఒక బాండింగ్ తో ఉన్న వీళ్లిద్దరికి ఏమైందో ఏమో గాని సడన్ గా విడిపోయారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఇక నయనతార హాయిగా వరస సినిమాలకు సైన్ చేస్తూ మంచి సినిమాలతో దూసుకెళ్తుంటే.ప్రభుధవా మాత్రం అటు ఫ్యామిలీకి దూరమై ఇటు ప్రియురాలు పోయి చాల బాధ అనుభవించారట.

Advertisement

ఇక ప్రభుదేవా కంటే ఎక్కువ బాధ ఆయన తాళి కట్టిన భార్య అనుభవించిందట.ఏదో అనారోగ్య సమస్యతో హాస్పటల్ ఉన్నా కూడా ప్రభుదేవా చూడటానికి వెళ్లలేదట.అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రభుదేవా తన ఫ్యామిలీకి దగ్గరవుతున్నాడు.

తాజా వార్తలు