Sajjala Ramakrishna Reddy : “ప్రజాగళం” విఫలం సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.బీజేపీ.

టీడీపీ.జనసేన కూటమిపై( TDP BJP Janasena Alliance ) విమర్శలు చేశారు.

మళ్లీ పదేళ్ల తర్వాత అదే నాటకం మొదలు పెట్టారని సీరియస్ అయ్యారు.ఆ మూడు పార్టీలకి పొత్తు కొత్త కాదని వ్యాఖ్యానించారు.

సరిగ్గా పది సంవత్సరాల క్రితం ఈ మూడు పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయాయి అని మీడియా సమావేశంలో విమర్శించారు.నాడు విడాకులు తీసుకొని విడిపోయి ఒకరిపై ఒకరు దూషించుకున్నారని ఎద్దేవ చేశారు.

Advertisement

అప్పట్లో ప్రధాని మోదీని చంద్రబాబు( Chandrababu ) ఇష్టానుసారంగా విమర్శించారని పేర్కొన్నారు.

అప్పుడు ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజి పైకి వచ్చారని నిలదీశారు.సీఎం జగన్ ని( CM Jagan ) విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే సమయం కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభ నిర్వహించటం చేతగాక పోలీసులపై విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు.అధికారంలోకి రావాలనే ఆత్రుత చంద్రబాబుకి ఎక్కువైంది .2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.? 2024లో మళ్ళీ కలిసి స్టేజిపై ప్రత్యక్షమయ్యారు.మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని సజ్జల ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇదే సమయంలో ఆదివారం నిర్వహించిన "ప్రజాగాళం" సభ పూర్తిగా విఫలం అయిందని అన్నారు.

విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ హీరోగా కలలు కంటున్నాడా?
Advertisement

తాజా వార్తలు