ప్లాటినం లెగ్ అంటూ హీరోయిన్ పై ప్రశంసలు.. పులిహోర కలుపుతున్నావా అంటూ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, కమెడీయన్ గామంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియాలో ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంటే వాటి గురించి స్పందించి తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉంటారు.ఇలా బ్రహ్మాజీకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

Praise For The Heroine By Saying That She Has A Platinum Leg, Brahmaji, Samyukth

గతంలో అనసూయ ఆంటీ వివాదం పై ఈయన పరోక్షంగా స్పందిస్తూ నన్ను అంకుల్ అన్న కూడా నేను కేసు వేస్తాను అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇలా పలు విషయాల గురించి తనదైన శైలిలో కామెడీ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న బ్రహ్మాజీ నటి సంయుక్త మీనన్ (Samyuktha Menon) పై ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా ఈమె హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తోకలిసి విరూపాక్ష (Virupaksha) సినిమాలో నటించారు.

ఈ సినిమా ఈనెల 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

Advertisement
Praise For The Heroine By Saying That She Has A Platinum Leg, Brahmaji, Samyukth

ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Praise For The Heroine By Saying That She Has A Platinum Leg, Brahmaji, Samyukth

ఇకపోతే ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి సంయుక్త మీనన్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు.విరూపాక్ష ట్రైలర్ ఎలా ఉంది మీకు నచ్చిందా అంటూ ఈమె ప్రశ్నించారు.ఇలా నేటిజన్స్ తో చిట్ చాట్ చేస్తున్న సంయుక్త మీనన్ కి బ్రహ్మాజీ సమాధానం చెప్పారు.

ట్రైలర్ నచ్చిందా అన్న ప్రశ్నకు బ్రహ్మాజీ సమాధానం చెబుతూ.చాలా బాగుంది ప్లాటినం లెగ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు.

ఇది చూసిన సంయుక్త అరే ఏంటి బ్రహ్మీ గారు అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా వీరిద్దరి సంభాషణ చూసిన నేటిజన్స్ ఏయ్ ఏయ్ అన్నా హీరోయిన్ తో పులిహోర కలుపుతున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

అయితే సంయుక్త మీనన్ తెలుగులో నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్ కావడంతో బ్రహ్మాజీ తనని ప్లాటినం లెగ్ అని ఉద్దేశిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు