ఆంటీ ఊపుడుకి షేక్ అవుతున్న సోషల్ మీడియా

టాలీవుడ్‌లో క్యారెక్టర్ పాత్రలు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న వారిలో నటి ప్రగతి కూడా ఒకరు.

హీరో, హీరోయిన్ల అమ్మ పాత్రల్లో ఎక్కువగా నటించని ఈ బ్యూటీ.

సారీ ఆంటీ, వరుసగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టుకుంది.అయితే సినిమాల్లో ఎక్కువ వయసున్న పాత్రల్లో నటించే ప్రగతి, నిజానికి అంత వయసు ఉండదని తెలుస్తోంది.

Pragathi New Dance Moves Goes Viral, Pragathi, Character Artist Pragathi, Instag

వయసు పరంగా తక్కువ వయస్సున్నా తల్లి పాత్రలే ఎక్కువగా రావడంతో ఆమె ఆ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది.ఇక ఈ విషయాలు పక్కనబెడితే, నటి ప్రగతి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను ఆనందపరుస్తుంటోంది.

ఇటీవల వరుసగా వీడియోలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఆమె చేసే వీడియోలను అభిమానులు తెగ ఎంజాయ్ చేయడమే కాకుండా వాటిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Advertisement

ఇటీవల ఓ మాస్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులతో తుక్కురేగ్గొట్టిన ప్రగతి, తాజాగా వర్కవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోలో ఆమె తన నడుముతో చేసిన మూవ్స్ బాగుండటంతో అభిమానులు ఈ వీడియోను కూడా తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

మొత్తానికి లాక్‌డౌన్ వేళ కేవలం స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాకుండా ప్రగతి లాంటి పాపులారిటీ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమలోని కొత్త ట్యాలెంట్‌ను బయటకు తీస్తున్నారు.ఇక ప్రగతి చేస్తున్న వీడియోలతో ఆమెకు వస్తున్న పాపులారిటీని చూసి మిగతా వారు నోరెళ్లబెడుతున్నారు.

ఏదేమైనా నటనతోనే కాకుండా ఇలా అదనపు ట్యాలెంట్‌తో కూడా అభిమానులను సంపాదించవచ్చని ప్రగతి నిరూపించింది.

మొటిమలపై నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించాలి
Advertisement

తాజా వార్తలు