ప్రభుదేవా కొడుకు తండ్రిని మించిన తనయుడు అవుతాడా.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్‌, హీరో, డైరెక్టర్‌ ప్రభుదేవా( Prabhu Deva ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చాలా సినిమాలలో హీరోగా నటించారు.

సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేసి మంచి మంచి స్టెప్పులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇలా వివిధ రంగాలలో తనదైన శైలిలో ప్రతిభను చూపిస్తూ భారీగా అభిమానులను సంపాదించుకున్నారు ప్రభుదేవా.ప్రస్తుతం సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మాస్టర్ తన కుమారుడు రిషి దేవాను( Rishi Deva ) ప్రేక్షకులకు పరిచయం చేశారు.అచ్చం ప్రింట్ గుద్దినట్టు ప్రభుదేవా మాస్టర్ మాదిరిగానే ఉన్నాడు రిషి దేవా.

Advertisement

పక్క పక్కన చూస్తే అన్నదమ్ముల్లా కనిపిస్తూ ఉంటారు.కాగా ఇటీవల జరిగిన ఒక డాన్స్‌ ఈవెంట్‌ లో తన కుమారుడు రిషి దేవాను పరిచయం చేయడమే కాకుండా కొడుకుతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు ప్రభుదేవా.సుందరం మాస్టర్‌( Sundaram Master ) అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.

ఎన్నో గొప్ప సినిమాలకు కొరియోగ్రాఫర్‌ గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు సుందరం మాస్టర్‌.ఆయన తనయులు రాజు సుందరం, ప్రభుదేవా, నాగేంద్ర ప్రసాద్‌ కూడా డాన్స్‌ మాస్టర్లు మంచి పేరు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా రాజు సుందరం, ప్రభుదేవా టాప్‌ హీరోలుగా ఉన్నవారందరి సినిమాలకు పని చేశారు.రాజు సుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్‌ గా జాతీయ అవార్డును( National Award ) సైతం అందుకున్నారు.

తండ్రి నృత్య వారసత్వాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన రాజు సుందరం, ప్రభుదేవా మాదిరిగానే రిషి దేవా కూడా మంచి కొరియోగ్రాఫర్‌ గా పేరు తెచ్చుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!

ప్రభుదేవా, రిషిదేవా ఒకే వేదికపై కలిసి డాన్స్‌ చేయడాన్ని ఈవెంట్‌కి వచ్చినవారంతా ఎంతో ఎంజాయ్‌ చేశారు.ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది.తన కొడుకుతో కలిసి డాన్స్‌ చేసిన వీడియోను షేర్‌ చేస్తూ.

Advertisement

నా కొడుకు రిషిదేవ్‌ ని పరిచయం చేయడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను.ఇది కేవలం నృత్యం కాదు, ఇది ఒక వారసత్వం, ఒక అభిరుచి.

ప్రయాణం ఇప్పుడే మొదలైంది.అంటూ ఆ పోస్ట్‌ కి క్యాప్షన్‌ ని కూడా జోడించారు.

అయితే స్టేజ్ పై రిషి డాన్స్ చూసిన ప్రేక్షకులు తండ్రిని మించిన తనయుడు అవుతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు