హృతిక్ అడుగుజాడల్లో ప్రభాస్.. ఎంతవరకు మెప్పిస్తాడో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో జాన్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వకుండానే మరో సినిమాకు ప్రభాస్ పచ్చ జెండా ఊపాడు.మహానటి చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ ఓకే అన్నాడు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎవ్వరూ ఊహించని పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది.ఈ సినిమాతో బాహుబలిని మించిపోయేందుకు ప్రభాస్‌ను సిద్ధం చేస్తాడట నాగ్ అశ్విన్.

ఇంతకీ ఈ సినిమాలో ప్రభాస్ చేయబోయే పాత్ర ఏమిటా అని అనుకుంటున్నారా? బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ చేసిన క్రిష్ తరహా పాత్రలో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఓ సూపర్ హీరోగా నటించనున్నాడట.

Advertisement

భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్‌ నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.మరి ప్రభాస్‌ను మనకు నాగ్ అశ్విన్ ఎలాంటి సూపర్ హీరోగా చూపిస్తాడనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement