Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా….ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

తెలుగు సినీ పరిశ్రమలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్.

( Ntr ) జూనియర్ ఎన్టీఆర్ ఒక పరిపూర్ణ నటుడని, యాక్షన్, కామెడీ అన్న తేడా లేకుండా ఏ ఎక్స్ప్రెషన్ ఐనా, ఏ పాత్ర ఐనా అద్భుతంగా నాటించగలడని అతనితో పని చేసిన దర్శకులందరు చెప్తుంటారు.

ఐతే వృత్తి పరంగా మాత్రమే కాకుండా, మనిషిగా కూడా మన జూనియర్ బంగారమట.జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబం పట్ల సన్నిహితుల పట్ల చూపించే ప్రేమ, అభిమానం గురించి కమీడియన్ ప్రభాస్ శ్రీను ( Prabhas sreenu )షాకింగ్ కామెంట్స్ చేసారు.

కమీడియన్ ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు.ప్రభాస్ శ్రీను, జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి,( Oosaravelli ) బృందావనం, యమదొంగ వంటి చిత్రాలలో కలిసి నటించారు.వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.

ఐతే యమదొంగ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దురదృష్టవశాత్తు ప్రభాస్ శ్రీను భార్యకు గర్భస్రావం జరిగింది.ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్తూరు జిల్లాలోని, తలకోన దగ్గర షూటింగ్లో ఉన్నారట.

Advertisement

అక్కడ ఫోన్ మాట్లాడాలంటే ఒక పెద్ద స్థంభం లాంటిదాని పైకి ఎక్కి మాట్లాడాలట.కేవలం, ప్రొడ్యూసరికి, డైరెక్టర్ కి, హీరోకి, హీరోయిన్ కి మాత్రమే ఫోన్ మాట్లాడడానికి పెర్మిషన్ ఉండేదట.

తాను తన భార్యతో హాస్పిటల్ లో ఉన్న విషయం తెలుసుకొని తారక్ తన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరిని కాదని నాకు ఫోన్ చేయడం తనలో ఎంతో అయన పట్ల గౌరవాన్ని పెంచిందని, అలాంటి ప్రదేశం నుంచి తనకు ఫోన్ చేసి బాగోగులు అడగడం నిజం గా మారె నటుడు చేయడు.ఇలాంటివన్నీ జీవితంలో సహజమని, ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దని అన్నారట.

ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోలేనని చెప్పుకొచ్చారు ప్రభాస్ శ్రీను.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో ( Devara movie )నటిస్తున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కు సిద్ధమవుతోంది.ఈ చిత్రం అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న వార్ 2 చిత్రంలో కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు తారక్.

Advertisement

తాజా వార్తలు