సలార్‌ డౌట్ లేదు.. ఇదే సాక్ష్యం అంటున్న ఫ్యాన్స్‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్( Prabhas ) హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్‌ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే మూడు నాలుగు నెలల నుంచి విడుదల విషయం లో ప్రభాస్ ఫ్యాన్స్ తో మేకర్స్ దోబూచులాడుతున్నారు.

సెప్టెంబర్‌ లో అంటూ ప్రకటించి డిసెంబర్ కి వాయిదా వేయడం జరిగింది.క్రిస్మస్ సందర్భంగా సలార్‌( Salaar ) ను విడుదల చేస్తామని యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

ఇప్పటి వరకు అదే మాట పై ఉన్నారు.అయితే ఇటీవల వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

సలార్ ను మొదట రెండు భాగాలు గా విడుదల చేయాలని భావించారు.

Advertisement

కానీ ఇప్పుడు ఒకే భాగం గా విడుదల చేయబోతున్నారు.అందుకే రీ ఎడిటింగ్‌( Salaar Re Editing ) తో పాటు కొన్ని సన్నివేశాల షూటింగ్‌ అవసరం అనిపిస్తోందట.అందుకే ప్రభాస్( Prabhas ) సలార్‌ సినిమా ను వాయిదా వేస్తారు అనే ప్రచారం జరిగింది.

అయితే అవన్నీ కూడా గాలి వార్తలే అంటూ సలార్‌ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.ఎట్టి పరిస్థితుల్లో సినిమా ను విడుదల చేసి తీరుతాం అంటూ వారు పేర్కొన్నారు.

సాధారణంగా సలార్‌ సినిమా ను నిర్మించిన హంబులే నిర్మాణ సంస్థ వారు విడుదలకు రెండు లేదా మూడు వారాల ముందే సినిమా బిజినెస్ చేస్తారు.

డిసెంబర్‌( December ) లో సినిమా విడుదల ఉంది కనుకే సలార్ బిజినెస్‌ షురూ అయిందని అంటున్నారు.చాలా కాలంగా సలార్ సినిమా ను కొనుగోలు చేసేందుకు కాచుకు కూర్చున్న పలు భాషల నిర్మాతలు మరియు బయ్యర్లు సలార్‌ సినిమా కచ్చితంగా డిసెంబర్‌ లో వస్తుందనే నమ్మకంతో భారీ మొత్తం లో పెట్టి కొనుగోలు చేసేందు క్యూ కడుతున్నారు.కనుక ప్రభాస్ సినిమా ఈ సారి వాయిదా పడే ఛాన్స్ లేదు అంటూ చాలా బలంగా ప్రభాస్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఇంట్లోనే సూపర్ సిల్కీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు