సలార్ మూవీలో ఎవరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. పృథ్వీరాజ్ సుకుమారన్ రెమ్యునరేషన్ అంత తక్కువా?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సలార్.

ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.ఇది ఇలా ఉంటే తాజాగా అనగా డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.దీంతో చిత్ర బృందం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో ఎవరెవరు ఏ రేంజ్ లో పారితోషికాలను అందుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ఈ సినిమాకు అను హీరో ప్రభాస్ దాదాపుగా 100 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా లాభాల్లో కూడా 10 శాతం షేర్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.

ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి దాదాపు రూ.50 కోట్లు, శృతి హాసన్‌కి రూ.8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ), జగపతిబాబు తలో రూ.4 కోట్ల పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం.మొత్తం మూవీ బడ్జెట్ రూ 400 కోట్ల వరకు ఉంటుందని టాక్.

అంటే ఓవరాల్ బడ్జెట్‌లో సగం రెమ్యునరేషన్స్‌కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది.సలాడ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే 400 కోట్లు రాబట్టడం పెద్ద సంగతి ఏమి కాదు అని తెలుస్తోంది.

మరి ఈ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుందో లేదో చూడాలి మరి.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు