Prabhas : అభిమానులకి గుడ్ న్యూస్.. సర్జరీ పూర్తి చేసుకున్న ప్రభాస్.. ఇండియాకు వచ్చేది ఎప్పుడంటే?

తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న విషయం తెలిసిందే.కోట్ల బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియాలో విడుదల కానుంది.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ) వహించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

Advertisement

అదేమిటంటే.ప్రస్తుతం ప్రభాస్ ఫారెన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.

సర్జరీ నిమిత్తం ఫారెన్ కు వెళ్లాడు.ప్రభాస్ చాలా కాలంగా కాలు నొప్పితో బాధపడుతున్నాడు.

మోకాలి నొప్పి( Knee Surgery ) ఎక్కువవ్వడంతో దానికి సర్జరీ చేయించుకునేందుకు ఆయన యూరప్ వెళ్ళారు.

సర్జరీ సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని రిటర్న్ కాబోతున్నట్టు తెలుస్తోంది.కాగా ప్రభాస్ బాహుబలి సినిమా నుంచే ఈ మోకాలి నొప్పితో బాధ పడుతున్నారు.కాని ఆ సినిమా తరువాత వరుస సినిమాల బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సమస్యపై దృష్టి పెట్టలేకపోయారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఈ మధ్య దాని కోసం తాత్కాలిక చికిత్స తీసుకున్నప్పటికీ ప్రభాస్ ఇంకా ఆ నొప్పితో బాధ పడుతూనే ఉన్నాడు.ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ ని ఆ బాధతోనే పూర్తి చేశాడు.

Advertisement

అయితే ఆ నొప్పి ఇప్పుడు మరింత ఎక్కువ అవ్వడంతో అది పెద్ద సమస్యగా మారడంతో సలార్ షూటింగ్ అయిపోగానే యూరప్ ప్లైట్ ఎక్కేశారు డార్లింగ్ ప్రభాస్.సెప్టెంబర్ లో ఈ సర్జరీ కోసం యూరప్( Europe ) వెళ్లిన ప్రభాస్ ఆపరేషన్ ని గత నెలలోనే పూర్తి చేసుకున్నాడు.

అయితే నెల పాటు విశ్రాంతి అవసరం అవ్వడంతో అక్కడే ఉండి రెస్ట్ తీసుకున్నాడు.ఇప్పుడు ప్రభాస్ కంప్లీట్ గా రికవరీ అయ్యినట్లు సమాచారం.నవంబర్ 6న హైదరాబాద్ లో ల్యాండ్ అవబోతున్నాడట.

ఇక వచ్చిన వెంటనే సలార్ ప్రమోషన్స్( Salaar Promotions ) ని ప్లాన్ చేయనున్నాడట.సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని ఇప్పటివరకు మొదలు పెట్టలేదు.దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ ఇండియాకు వస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

తాజా వార్తలు