ప్రభాస్‌ 'ప్రాజెక్ట్‌ కే' ఫైనల్ షెడ్యూల్‌ ఎప్పుడంటే..!

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే ( Project K )సినిమా చివరి షెడ్యూల్‌ కి రెడీ అయ్యింది.

ఈ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు ఈ సినిమాను దక్కించుకుంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.మహానటి చిత్రం తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్‌ ప్రారంభించి చాలా కాలం అయ్యింది.కానీ ఇప్పటి వరకు షూటింగ్ ముగించలేక పోయారు.ప్రభాస్ వేరే ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉండటం వల్ల సినిమా ను ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రారంభించిన సమయంలో సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు.కానీ ఇప్పటి వరకు సినిమా యొక్క చివరి దశ షూటింగ్‌ పూర్తి కాలేదు.వచ్చే ఏడాది లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

Advertisement

వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రాజెక్ట్‌ కే సినిమా చిత్రీకరణ జులై వరకు పూర్తి అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.సినిమా యొక్క పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ కాస్త ఎక్కువగా ఉంటుందట.

అందుకే సినిమాను భారీ అంచనాల నడుమ రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ చెప్పుకొచ్చారు.ఈ సినిమా లో భారీ ఎత్తున సినిమా వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాలు ఉంటాయట.

అందుకే కాస్త ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారు.అందుకే దాదాపు నాలుగు నుండి అయిదు నెలల పాటు షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కూడా వీఎఫ్‌ఎక్స్ వర్క్ చేయబోతున్నారు.

అమితా బచ్చన్‌ ( Amitabh Bachchan )ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ ఏడాది సలార్ మరియు ఆదిపురుష్ సినిమా లు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా రాబోతుంది.

Advertisement

తాజా వార్తలు