ఒకే నెలలో మూడు ప్రాజెక్ట్ లతో సందడి చేయబోతున్న ప్రభాస్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చే నెల లో ఏకంగా మూడు ప్రాజెక్టులతో సందడి చేయబోతున్నాడు.

అందులో మొదటి పది రోజులు సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు.

ఆ తర్వాత రెండు వారాల పాటు ప్రాజెక్ట్‌ కే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు అని ఇప్పటికే ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.ఆ తర్వాత వచ్చే నెల చివరి వారం లో మారుతి దర్శకత్వం లో రాజా డీలక్స్‌ సినిమా పట్టాలేకబోతుంది.

అలా ఒకే నెలలో మూడు సినిమా లకు సంబంధించిన హడావుడి ప్రభాస్ చేయబోతున్నాడు.ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా లు వరుసగా ముగింపు దశ కు చేరుకుంటున్నాయి.

ఈ ఏడాది చివర్లో సలార్ సినిమా షూటింగ్ ముగిసే అవకాశం ఉందని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్‌ నీల్ అధికారికం గా ప్రకటించాడు.

Advertisement

ఇక మహా నటి దర్శకుడు నాగ అశ్విన్‌ దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌ కే సినిమా కు సంబంధించిన షూటింగ్ కూడా ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరి వరకు పూర్తి అవుతుంది అంటూ అధికారికంగా సమాచారం అందుతుంది.ఇదే సమయం లో మారుతి దర్శకత్వం లో పట్టాలెక్కబోతున్న సినిమా కు సంబంధించిన షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది.మొత్తానికి ఈ సినిమా కు సంబంధించిన కార్యక్రమాలు ప్రభాస్ అభిమానులను సంతోష పెడుతున్నాయి.

ప్రస్తుతం పెద నాన్న కృష్ణం రాజు చనిపోయిన బాధ లో ఉన్న ప్రభాస్ అతి త్వరలోనే షూటింగ్ లో జాయిన్ అవుతాడు అంటూ ఆయన సన్నిహితులు అధికారికంగా ప్రకటించారు. ఇవి కాకుండా ఇంకా రెండు మూడు సినిమాలు కూడా ప్రభాస్ కమిట్‌ అయ్యి ఉన్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు