ప్రభాస్‌ మూవీ కొరియన్‌ సినిమాకు కాపీ.. ఎందుకు ఇలా చేస్తున్నాడు?

ప్రభాస్‌ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.అందులో మొదటిది ‘సాహో’.

దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందిస్తున్న కారణంగా ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇక అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.వచ్చే ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

‘సాహో’ చిత్రంతో పాటు ప్రభాస్‌ మరో సినిమాను చేస్తున్నాడు.ఆ సినిమాకు ‘జిల్‌’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ చేస్తున్న మూవీ కథ కాపీ అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం కాపీ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.కొరియన్‌ మూవీ ‘మై సిస్సీ గర్ల్‌’ కు ఇది కాపీ అనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది.

అయితే దీనిని కాపీ అనడానికి లేదు.ఆ సినిమాను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని మాత్రమే తాము సినిమాను చేస్తున్నాం తప్ప ఆ కథను ఉన్నది ఉన్నట్లుగా దించేయడం లేదు అంటూ ప్రభాస్‌ అండ్‌ టీం చెబుతున్నారు.

కొరియన్‌ మూవీ అయిన మై సిస్సీ గర్ల్‌ చిత్రానికి భారీ వసూళ్లు నమోదు అయ్యాయి.ఇంగ్లీష్‌లో కూడా ఇది రీమేక్‌ అయ్యింది.చైనాలో డబ్‌ అయ్యి అద్బుతమైన వసూళ్లను దక్కించుకుందట.

అందుకే రాధాకృష్ణ ఈ చిత్రం కథను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని కథను రెడీ చేశాడనే సమాచారం అందుతోంది.పూర్తిగా కథను మార్చేస్తున్నారట.

స్టోరీ లైన్‌ మాత్రమే తీసుకుని, ఇండియన్‌ నేటివిటీకి తగ్గట్లుగా ఆ స్టోరీని మార్చినట్లుగా చెబుతున్నారు.మరి కాపీ కథతో రాబోతున్న ప్రభాస్‌ సక్సెస్‌ను దక్కించుకుంటాడేమో చూడాలి.

Advertisement