ప్రభాస్ నోరుని బాలకృష్ణ కూడా తెరిపించలేక పోయాడుగా..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రభాస్‌ ఎపిసోడ్ 1 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బాహుబలి ఎపిసోడ్ 1 లో ప్రభాస్ తో పెళ్లి విషయాలను బాలకృష్ణ చెప్పించలేక పోయాడు.గతంలో ఎన్నో సార్లు ప్రభాస్ ఇంటర్వ్యూలు చూశాం.

అందులో ఎప్పుడూ కూడా ప్రభాస్ తన పెళ్లి గురించి ప్రస్తావించిన సమయం లో సమాధానం దాటవేస్తూ వచ్చాడు.కానీ బాలకృష్ణ ముందు ప్రభాస్ పప్పులు ఉడకవు అని.కచ్చితంగా పెళ్లి గురించి ఒక స్పష్టమైన సమాధానమును ప్రభాస్ నుండి బాలకృష్ణ రాబడతాడని అంతా భావించారు.కానీ పెళ్లి విషయంలో ప్రభాస్ నోరు ని బాలకృష్ణ కూడా తెరిపించలేక పోయాడు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ ప్రేమ వ్యవహారాల గురించి బాలకృష్ణ షో లో ప్రస్తావించే ప్రయత్నం చేశాడు.కానీ వాటికి కూడా స్పష్టమైన సమాధానాలు ప్రభాస్ నుండి బాలయ్య రాబట్ట లేక పోయాడు.

Prabhas Marriage Issue In Balakrishna Unstoppable Show ,prabhas ,prabhas Marria
Advertisement
Prabhas Marriage Issue In Balakrishna Unstoppable Show ,prabhas ,prabhas Marria

సరదాగా సాగిన చిట్ చాట్ లో సీరియస్ విషయాలు ప్రస్తావన కు వస్తాయని కొందరు భావించారు.కానీ వారికి నిరాశే మిగిలింది.ప్రభాస్ పెళ్లి ఉందా లేదా అంటే ఉందనే సమాధానం చాలా కాలం నుండి వినిపిస్తుంది.

అది మరో సారి ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు, కానీ ఎప్పుడూ ఎవరిని అనే విషయం లో మాత్రం బాలకృష్ణ కూడా స్పష్టత తీసుకోలేక పోయాడు.రెండవ ఎపిసోడ్ లో ఆయన పెళ్లి కి సంబంధించి ఏమైనా ప్రత్యేక అప్డేట్ ఉంటుందా అనేది చూడాలి.

వచ్చే వారంలో బాహుబలి 2 ఎపిసోడ్‌ ను ఆహా వారు స్ట్రీమింగ్‌ చేస్తారా లేదంటే కాస్త గ్యాప్ తీసుకుంటారా అనేది చూడాలి.ప్రభాస్ ఎపిసోడ్ కు ఆహాలో మంచి స్పందన దక్కింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు