ఆలు లేదు సూలు లేదు... కేజీఎఫ్‌ 3 లో ప్రభాస్‌?

కే జి ఎఫ్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

కే జి ఎఫ్ 1 సినిమా కంటే మూడు నాలుగు రెట్లు అధిక వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో కేజిఎఫ్ మూడు సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కన్నడ సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా యాక్షన్ సినిమాలను విపరీతంగా ఆరాధించే సినీ ప్రేమికులు కే జి ఎఫ్ 3 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా పదే పదే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ చెబుతున్నారు.

కే జి ఎఫ్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మీడియా తో మాట్లాడుతూ కచ్చితం గా సినిమా మూడవ భాగం ఉంటుంది అని ప్రకటించాడు.కే జి ఎఫ్ 3 సినిమా కాస్త ఆలస్యం అయినా తప్పకుండా ఉంటుంది అనే నమ్మకాన్ని ఆయన మాట లతో వ్యక్తం చేశాడు.

సినిమా పూర్తి అయ్యే సమయం లో కూడా మూడవ పార్ట్‌ ఉంటుంది అన్నట్లుగానే హింట్‌ ఇచ్చారు.దాంతో ఇప్పటి నుండే కేజిఎఫ్ 3 సినిమా కు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది.

Advertisement

భారీ ఎత్తున మూడవ పార్ట్‌ ను ప్రశాంత్‌ నీల్ చేయబోతున్నాడు అంటూ కొందరు ఊహించుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం కేజీఎఫ్ 3 లో ప్రభాస్ ఉండబోతున్నాడు అంటూ ప్రచారం చేస్తున్నారు.సలార్‌ సినిమా తో ప్రస్తుతం ప్రభాస్ తో వర్క్ చేస్తున్న ప్రశాంత్‌ నీల్‌ ఇదే సమయంలో కేజీఎఫ్‌ 3 సినిమా కు సంబంధించిన చర్చ కార్యక్రమాలు కూడా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.ప్రభాస్ తప్పకుండా ఈ సినిమా లో నటిస్తాడని చాలా మంది నమ్మకంతో ఉన్నారు.

కొందరు మాత్రం ఆలు లేదు సూలు లేదు అన్న సామెత చెబుతూ ప్రభాస్ వార్తలను కొట్టి పారేస్తున్నారు.

Advertisement