సొంత బ్యానర్స్ పెట్టి సినిమాలు తీస్తున్న ప్రభాస్ హీరోయిన్స్ !

చాలామంది హీరోయిన్స్( Heroines ) ఇప్పుడు ఎవరిపై ఆధారపడటం లేదు.

ఎవరో వచ్చి తమకు అవకాశాలు ఇచ్చి స్టార్ హీరోయిన్స్ చేస్తారని కలలు కనడం లేదు.

ఎవరి కాళ్లపై వాళ్ళు నిలబడాలనుకుంటున్నారు.ఒకరు మనకు అవకాశాలు ఇచ్చేది ఏంటి మనమే వేరే వారికి అవకాశాలు కూడా కల్పిద్దాం అనే ఆలోచనలో కూడా కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు.

ఇప్పుడు మన ప్రభాస్ హీరోయిన్స్( Prabhas Heroines ) కొంతమంది అదేదోవలో తమ సొంత కాళ్లపై నిలబడుతూ ఎవరిపై ఆధారపడకుండా సొంత సినిమాలను కూడా తీస్తున్నారు.ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు ? ఎలాంటి పనులు చేస్తున్నారు అనే విషయాలను ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

కృతి సనన్( Kriti Sanon )

Prabhas Heroines Own Production Banners,kriti Sanon,taapsee Pannu,kangana Ranaut

డార్లింగ్ ప్రభాస్ సరసన ఆది పురుష్ సినిమా( Adipurush )లో హీరోయిన్ గా నటించిన నటీనటులతో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్లపై కూడా విపరీతమైన నెగటివ్ ట్రోలింగ్ జరగగా కాస్త తక్కువ నెగెటివిటీ తో బయటపడింది కృతి సనన్.అయితే ఈ సినిమా తర్వాత ఈ అమ్మడి కెరియర్ కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.అయితే ఎవరికి భయపడేది లేదు అంటూ తన సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం కూడా చేస్తుంది.

Advertisement
Prabhas Heroines Own Production Banners,kriti Sanon,taapsee Pannu,kangana Ranaut

అంతేకాదు తానే సొంతంగా ఓ బ్యానర్ కూడా ప్రారంభించి చాలా కాన్ఫిడెంట్ గా సినిమాలను తీయాలి అని అనుకుంటుంది.

తాప్సి( Taapsee )

Prabhas Heroines Own Production Banners,kriti Sanon,taapsee Pannu,kangana Ranaut

ఈ అమ్మడు మొదటి నుంచి రెబల్ స్టార్ అని అనుకోవచ్చు.స్టీరియోటైప్ హీరోయిన్స్ లాగా కాకుండా తనకంటూ ఒక సెపరేట్ జోనర్ ని క్రియేట్ చేసుకుని అందులోనే సినిమాలు తీసుకుంటూ వెళుతుంది.ఆమె మొదట్లో అందరి స్టార్ హీరోలతో ఆడి పాడినప్పటికి ఆ తర్వాత ఎక్కువగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకే( Female Oriented Movies ) మొగ్గు చూపింది.

ఇటీవల తనకు నచ్చినట్టుగా సినిమాలు తీసుకోవడానికి సొంత బ్యానర్ ని ఏర్పాటు చేసుకుంది.బయట బ్యానర్స్ తో పాటు తన బ్యానర్ లో కూడా సినిమాలు చేస్తుంది.

కంగనా రనౌత్( Kangana Ranaut )

బాలీవుడ్ లోనే మోస్ట్ కాంట్రవర్షల్ హీరోయిన్ గా కంగనాకి పేరు ఉంది.అయితే ఆమె ఈరోజు ఈ స్థాయికి ఖచ్చితంగా వస్తుందని ప్రభాస్ ముందే ఊహించినట్టు ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.కంగనా మొదట్లో అవకాశాల కోసం చాలా ఇబ్బందులు పడిన ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఇప్పుడు నిర్మాతగా దర్శకురాలిగా తన సొంత బ్యానర్ లో సినిమాలు చేసుకుంటుంది.తనకు ఒకరి అవకాశం ఇచ్చేది ఏంటి తనే పది మందికి అవకాశాలు ఇస్తానంటూ సవాలు చేస్తుంది.

Advertisement

పైగా ఇటీవలే రాజకీయాల్లో( Politics ) కూడా అడుగుపెట్టి పోటీ కూడా చేస్తుంది.

తాజా వార్తలు