పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్ ( Tollywood, Bollywood )ఇతర ఇండస్ట్రీలలో నటి దీపికా పదుకొనేకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో గుర్తింపు ఉంది.

కల్కి 2898 ఏడీ ( Kalki 2898 AD )సినిమాతో దీపికా పదుకొనే మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

దీపికా పదుకొనే ఈరోజు పండంటి ఆడబిడ్డకు( female child ) జన్మనిచ్చారు.ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో దీపికా పదుకొనే బిడ్డకు జన్మనిచ్చారని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం దీపికా పదుకొనే, అమె కూతురు క్షేమంగానే ఉన్నారు.దీపికా పదుకొనేకు కూతురు పుట్టడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి.

ప్రభాస్ ఫ్యాన్స్ దీపికకు కూతురు పుట్టడంతో శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు కల్కి సీక్వెల్ లో మగబిడ్డకు జన్మనివ్వనున్న దీపిక రియల్ లైఫ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చిందంటూ సరదాగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.ప్రముఖ సెలబ్రిటీలు దీపిక రణ్ బీర్ లకు శుభాకాంక్షలు చెబుతుండటం గమనార్హం.

Advertisement

దీపికా పదుకొనే ,రణ్ వీర్( Deepika Padukone, Ranveer ) రామ్ లీలా సినిమాలో తొలిసారి కలిసి నటించారు.ఈ సినిమా షూట్ సమయంలోనే రణ్ బీర్ దీపిక మధ్య ప్రేమ మొదలై ఆ ప్రేమ పెళ్లిగా మారింది.2018 సంవత్సరంలో దీపిక రణ్ వీర్ పెళ్లి జరిగింది.రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ సినిమాతో గతేడాది రణ్ వీర్ సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

ప్రస్తుతం రణ్ వీర్ సింగం అగైన్ అనే ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.

కల్కి సీక్వెల్ షూటింగ్ లో దీపికా పదుకొనే పాల్గొనడానికి చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కల్కి సీక్వెల్ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా 2028లో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.కల్కి మూవీ సీక్వెల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రభాస్ ఈ సినిమా కోసం ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయించనున్నారని తెలుస్తోంది.

ఆ సమయంలో రాజ్ తరుణ్ ను నేనే పోషించాను.. లావణ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు