అఫిషియల్ : ప్రాజెక్ట్ కే లో కమల్.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన ప్రభాస్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే ( Project K )ఒకటి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొనే, బిగ్ బి వంటి స్టార్స్ భాగం అయిన విషయం విదితమే.

Prabhas Exciting Post On Working With Kamal Haasan, Prabhas, Project K, Deepika

వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్( Kamal Haasan ) కూడా కీలక పాత్ర చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ వార్తలను నిజం చేస్తూ ఈ రోజు కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది.దీంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక్కసారిగా ఈ అనౌన్స్ మెంట్ ప్రకంపనలు రేపింది.

ప్రభాస్( Prabhas ), కమల్ హాసన్ కలిసి పని చేయబోతున్నారు అని తెలిసి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ మేకర్స్ అఫిషియల్ గా కమల్ హాసన్ ఉన్నట్టు తెలిపారు.

Advertisement
Prabhas Exciting Post On Working With Kamal Haasan, Prabhas, Project K, Deepika

అలాగే ఆ వెంటనే ప్రభాస్ కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.కమల్ హాసన్ తో నటించడంపై ఎమోషనల్ వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Prabhas Exciting Post On Working With Kamal Haasan, Prabhas, Project K, Deepika

కమల్ హాసన్ తో వర్క్ చేయడంపై డార్లింగ్ పోస్ట్( Prabahs Tweet ) చేస్తూ.నా గుండెల్లో ఎప్పటికి దాచుకునే ఒక బ్యూటిఫుల్ మూమెంట్( Beautiful Moment ) ఇది అని కమల్ హాసన్ సార్ తో నటించే అవకాశం దొరకడం ఒక అదృష్టం అని ఇది పెద్ద గౌరవంగా భావిస్తున్నాను అని.ఒక టైటాన్ ఆఫ్ సినిమా లాంటి నటుడితో నటించడం అనేది ఒక కల అని అది నిజం అవ్వడం అదృష్టం అని ఈ కలయికతో చాలా నేర్చుకుంటాం అని చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు