ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోకూడదా?.. ప్రభాస్ కామెంట్స్ వైరల్!

ఈటీవీలో ప్రసారమవుతున్న నా ఉఛ్వాసం కవనం(naa uchvasam kavanam) కార్యక్రమానికి ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఈ షోలో ప్రభాస్ (Prabhas)మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఇప్పటికే ఈ షో కి సంబంధించి చాలా ప్రోమోలు విడుదల అవ్వగా తాజాగా ఈ షో కి సంబంధించి మరొక ప్రమోను కూడా విడుదల చేశారు.తాజాగా విడుదలైన మూడవ ఎపిసోడ్‌ లో పవన్‌ కల్యాణ్(Pawan Kalyan) నటించిన జల్సా సినిమాలోని చలోరే చలోరే చల్‌ పాట గురించి వివరించారు.

తాను ఏ పార్టీకి వెళ్లినా ఈ పాట గురించే చర్చిస్తానని అన్నారు.

అలాగే సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాటల గురించి ప్రస్తావించారు.జల్సా (Jalsa) సినిమాలోని చలోరే చలోరే చల్‌ (Chalore Chalore chal)పాట నాకు చాలా ఇష్టం.దాని అర్థం గురించి ఎన్నిసార్లు మాట్లాడానో లెక్కేలేదు.

Advertisement

పార్టీలో నేను ఆ పాట ప్లే చేయగానే ఒక్కోసారి మా ఫ్రెండ్స్‌ పారిపోయేవారు.మళ్లీ దాని గురించి చెబుతానని.

ఈ పాటలో వచ్చే లైన్స్ ఎంత ఇష్టమో చెప్పలేను.ఆయన సినిమా స్టోరీ కోసం రాసినా.

మన లైఫ్‌స్టైల్స్‌ గురించే రాశారని నాకు అనిపించింది.ఆట సినిమాలో టైటిల్‌ సాంగ్‌ కూడా బాగుంటుంది అని తెలిపారు డార్లింగ్ ప్రభాస్(Darling Prabhas).

మనీ సినిమాలో భద్రం బి కేర్ పుల్ పాట కూడా ఆయన రాసిందే కదా అందులో పెళ్లి చేసుకోవద్దని రాశారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

తర్వాత సినిమాల్లో పెళ్లి గురించి గొప్పగా వర్ణిస్తూ చాలా సాంగ్స్‌ రాశారు.ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా.చేసుకోకూడదా? అని నవ్వుతూ ప్రశ్నించాడు ప్రభాస్(Prabhas).తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన పాటల జాబితా సిద్ధం చేస్తే అందులో చక్రం సినిమాలోని జగమంత కుటుంబం(Jagamanta Kutaumbam).కచ్చితంగా ఉంటుంది.

Advertisement

ఈ పాట నా సినిమా కోసం రాయడం నా అదృష్టం.దీని స్ఫూర్తితో కృష్ణవంశీ ఈ సినిమా స్టోరీ రాశారట.

దీని సాహిత్యం వెనక ఉన్న అర్థం తెలిసి నాకు ఒక్క క్షణం మతిపోయింది.అలా కూడా రాయగలరా అని ఆశ్చర్యపోయాను.

ఈ పాట విన్నప్పుడల్లా నాకు కన్నీళ్లు వస్తాయి.సీతారామశాస్త్రి గురించి చెప్పడం అంత తేలికైన విషయం కాదు.

పెద్దపెద్ద పండితులు మాత్రమే ఆయన గురించి చెప్పగలరు.నా మాటల్లో చెప్పాలంటే తెలుగు సాహిత్యరంగంలో ఆయన ఒక సింహం.

ఆయన తెలుగు పాటలు రాయడం మనందరి అదృష్టం అని చెప్పుకొచ్చారు డార్లింగ్ ప్రభాస్.

తాజా వార్తలు