ఓ డియర్‌ కూడా శృతి మించుతుందా.. ఒక్క నిమిషానికి రెండు కోట్లు ఏంటీ?

బాహుబలి చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందినా కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది కనుక నిర్మాతలకు లాభాలు వచ్చాయి.

సాహో చిత్రం దాదాపుగా 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కారణంగా సినిమాకు భారీ వసూళ్లు వచ్చినా కూడా నిర్మాతలకు నష్టాలు మిగిలాయి.

సాహో చిత్రంను 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించి ఉంటే బాగుండేది అనేది అందరిమాట.ఆ మాటను నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు.

సినిమా బడ్జెట్‌ కాస్త ఎక్కువ అయ్యిందని గతంలో కూడా ప్రభాస్‌ అన్నాడు.

ఇక ప్రస్తుతం ప్రభాస్‌ తన 20వ చిత్రం ఓ డియర్‌ లో నటిస్తున్నాడు.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు మళ్లీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సాహోకు జరిగిన అనుభవం గుర్తు పెట్టుకోకుండా మళ్లీ ఈ సినిమాను కూడా శృతి మించిన బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజాగా ఈ సినిమా కోసం రెండు కోట్లతో ఒక మార్కెట్‌ సెట్‌ను నిర్మించడం జరిగింది.ఈమద్య కాలంలో రెండు కోట్లతో సెట్‌ అంటే మామూలు విషయమే కదా అనుకుంటున్నారా.

ఇక్కడో విషయం చెప్పాలి.ఏంటీ అంటే ఆ రెండు కోట్ల సెట్‌లో కేవలం ఒక్క నిమిషం సీన్‌ మాత్రమే ఉంటుందట.

అది కూడా ఒక యాక్షన్‌ సీన్‌ ఉంటుందని అంటున్నారు.చేసింగ్‌ కోసం మార్కెట్‌ సీన్‌ను రీ క్రియేట్‌ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

కేవలం రెండు రోజులు ఆ సెట్‌లో షూటింగ్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే ఇది కూడా శృతి మించుతున్నట్లుగానే అనిపిస్తుందని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement