ఆదిపురుష్ సీతమ్మ వచ్చేసింది..!

ప్రభాస్( Prabhas ) హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆదిపురుష్.టీ సీరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తుంది.

జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి సీతమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.

బాలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో దూసుకెళ్తున్న కృతి సనన్ సీత పాత్రలో ఒదిగిపోయినట్టు ఫస్ట్ లుక్ చూస్తేనే అర్ధమవుతుంది.కృతి సనన్( Kriti Sanon ) కి ఆదిపురుష్ మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.

రామాయణ కథతో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు.సీతగా కృతి సనన్ చేస్తుంది.సినిమాలో రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

Advertisement

సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా త్వరలో సినిమా కోసం భారీ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.ప్రభాస్ ఆదిపురుష్( Adipurush ) ప్రమోషన్స్ కోసం మే నెల మొత్తం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ డైరెక్ట్ గా బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినీమా.ఈ సినిమాపై నేషనల్ లెవల్ లో భారీ క్రేజ్ ఏర్పడింది.

ప్రభాస్ ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలిసిందే.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు