Prabhas Adipurush: ప్రభాస్ ఆదిపురుష్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.. సూపర్ టైమింగ్‌

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందిన హిందీ సినిమా ఆదిపురుష్ సంక్రాంతి బరి నుండి తప్పుకుంది.

గ్రాఫిక్స్ వర్క్‌ పూర్తి కానందున సినిమా యొక్క విడుదల తేదీని మార్చే ఉద్దేశ్యం తో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

హీరో గా ప్రభాస్‌ ఈ సినిమా తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.ఈ సినిమా లో రాముడి గా ప్రభాస్‌ కనిపించబోతున్న విషయం తెల్సిందే.

రావణాసురుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్‌ నటిస్తున్నాడు.ఇండియాస్ బిగ్గెస్ట్‌ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు దర్శకుడు ఓమ్‌ రౌత్ తీసుకు రాబోతున్నాడు.

దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నారట.కేవలం గ్రాఫిక్స్ కోసం 300 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Advertisement

సినిమా విడుదల అయ్యే సమయంకు ఈ మొత్తం మరింత ఎక్కువ అయినా కూడా ఆశ్చర్యం లేదు.బిగ్ స్క్రీన్ పై ఈ సినిమా ఒక వండర్ అన్నట్లుగా ఉండబోతుంది అంటూ ప్రేక్షకులకు దర్శకుడు హామీ ఇస్తున్నాడు.

ప్రభాస్‌ అభిమానులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సినీ అభిమానికి కూడా ఈ సినిమా సర్‌ ప్రైజ్‌ ఇవ్వడం ఖాయం అంటున్నారు.

తెలుగు మరియు ఇతర భాష ల్లో కూడా ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు.కేవలం ఇండియన్‌ భాషలు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఈ సినిమా ను విడుదల చేసే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా ను రూపొందించారని తెలుస్తోంది.అద్భుతమైన కథ మరియు కథనంతో ఈ సినిమా ను దర్శకుడు ఓమ్‌ రౌత్‌ అద్భుతంగా రూపొందించాడు.

కనుక సమ్మర్‌ లో ఈ సినిమాను విడుదల చేస్తే ఎక్కువ మందికి రీచ్‌ అయ్యే అవకాశం ఉంది.అందుకే సంక్రాంతికి ఈసినిమాను వాయిదా వేసి సమ్మర్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement