నైజాంలో నేటి నుండి ఆదిపురుష్‌ అంతా నార్మల్‌.. మరి కలిసి వచ్చేనా!

ఆదిపురుష్ సినిమా( Adipurush ) మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఆదిపురుష్‌ 550 కోట్ల రూపాయలతో రూపొందిన విషయం తెల్సిందే.

సినిమా కు భారీగా ఖర్చు పెట్టడంతో పాటు పెద్ద సినిమా అవ్వడం వల్ల ఈ సినిమా కు మొదటి వారం రోజులు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ను కల్పించడం జరిగింది.నైజాం ఏరియా లో ఆదిపురుష్ సినిమా టికెట్ల రేట్ల ను భారీగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కానీ సినిమా కు వచ్చిన నెగటివ్ టాక్( Adipurush Trolls ) నేపథ్యం లో మొదటి మూడు రోజులు టికెట్ల రేట్లు పెంచిన డిస్ట్రిబ్యూటర్లు సోమ వారం నుండి నార్మల్‌ రేట్ల కు అమ్మేందుకు సిద్ధం అయినట్లుగా సమాచారం అందుతోంది.నేటి నుండి టికెట్ల రేట్ల ను నార్మల్ గా చేయనున్న నేపథ్యం లో ఆదిపురుష్ కు భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది.టికెట్ల రేట్ల తగ్గింపు విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తే తప్పకుండా రామాయణం( Ramayanam ) ను చూడాలనే ఉద్దేశ్యం తో ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి.

ఆదిపురుష్ సినిమా యొక్క బడ్జెట్‌ భారీగా ఉండటంతో మొదటి వారం పది రోజుల పాటు టికెట్ల రేట్ల ను పెంచుకనే వెసులుబాటు ఇచ్చినా కూడా సినిమా కు నెగటివ్ టాక్‌ వచ్చిన కారణంగా నేటి నుండి నార్మల్ గానే టికెట్ల రేట్లను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Advertisement

ఆదిపురుష్ సినిమా యొక్క వివాదాల కారణంగా మంచి పబ్లిసిటీ అయితే దక్కుతుంది.కానీ సినిమా కు వచ్చిన నెగటివ్ టాక్ కారణంగా ఆశించిన స్థాయి లో సినిమా వసూళ్లు సాధించడం లేదు అంటూ ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఆదిపురుష్ సినిమా యొక్క వసూళ్ల విషయం లో జరుగుతున్న ప్రచారం ను కొందరు తప్పుబడుతున్నారు.

నిజాలు దాస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు