Prabhas : పని మనిషి తో కూర్చొని భోజనం చేయించారు : ప్రభాస్

చాలామంది పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ఒక గొప్ప దర్శకుడు అని, ఫిలాసఫీ చాలా అద్భుతంగా చెబుతాడు అని అంటూ ఉంటారు.

ఆయన చేసే సినిమాలు మాత్రమే కాదు నిజజీవితంలో ఆయన అనుభవించిన పాఠాలు కూడా పెద్దవి.

అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి పాఠం కూడా ప్రతి ఒక్కరికి ఒక జీవితపాఠంగా మారుతుంది.ఎంతోమంది పూరి జగన్నాథ్ మాటలను ఆదర్శంగా తీసుకుంటారు.

ఆయనను అభిమానిస్తూ కూడా ఉంటారు అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పూరీ జగన్నాథ్ ఎంత మంచి వ్యక్తి ఎంత గుణవంతుడో ఆయన భార్య అంతకన్నా కూడా అద్భుతమైన వ్యక్తి.పూరి జగన్నాథ్ భార్య పేరు లావణ్య.

( Lavanya ) వీరిది ప్రేమ వివాహం.

Advertisement

ఒక షూటింగ్ సందర్భంగా లావణ్యని చూసి అక్కడే ప్రేమలో పడిపోయాడట పూరీ జగన్నాథ్.ఆ తర్వాత ఆమెను ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.వీరికి ఇద్దరు పిల్లలు కాగా పూరి జగన్నాథ్ మంచి చెడులలో ఆమె పాత్ర ఉంది.

ఆమె గుణగణాలు ఎంత అద్భుతం అంటే ప్రభాస్( Prabhas ) ఓసారి ఇంటర్వ్యూలో లావణ్య గురించి మాట్లాడాడు.లావణ్య అంటే తనకు చాలా ఇష్టమని ఆవిడ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ చెప్పాడు.

ఒకరోజు బుజ్జిగాడు సినిమా( Bujjigadu Movie ) షూటింగ్ టైంలో లంచ్ పట్టుకుని షూటింగ్ కి వచ్చారట లావణ్య.ఆవిడతో పాటు ఇంకొక లేడీ కూడా వచ్చారట.

అందరూ కలిసి ఒకే చోట కూర్చొని భోజనం చేశారట.పూరి జగన్నాథ్, ప్రభాస్, లావణ్య ఇంకా కొంతమంది కలిసి భోజనం పూర్తి చేసుకున్నారట.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

లంచ్ ( Lunch ) పూర్తయిన తర్వాత ప్రభాస్ లావణ్యని అడిగారట.మీ పక్కన కూర్చున్న ఆడ వ్యక్తి ఎవరు అని ఆమె దానికి మా పనిమనిషి( Maid ) అండి అని చెప్పారట.అంత పెద్ద షూటింగ్లో అంత మంది మధ్యలో ఒక పని మనిషి ని పక్కన కూర్చోబెట్టి తమతో సమానంగా భోజనం చేయనివ్వడం అనేది సాధారణంగా ఎవ్వరూ చేయరు.

Advertisement

కానీ లావణ్య పని మనిషి కి కూడా ఒక అత్యున్నత స్థానం ఇస్తారు.అందుకే ఆవిడంటే తనకు చాలా ఇష్టం అని ప్రభాస్ చెప్పారు.తను ఇప్పటి వరకు అభిమానించే ఆడవాళ్ళలో ముందు స్థానంలో లావణ్య ఉంటారని కూడా చెప్పడం నిజంగా ఆమె గొప్పతనానికి నిదర్శనం.

తాజా వార్తలు