చంద్రహాస్ స్టంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే.. మరీ ఈ రేంజ్ యాక్షనా?

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అన్నది సెలబ్రిటీ కావడం అన్నది అంత ఆషామాషి విషయం కాదు.

ఎందుకంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారు ఇంతకుముందు ఎన్నో కష్టాలను, అవమానాలను భరించారు.

వాటిన్నింటిని అధిగమించి ప్రస్తుతం సెలబ్రెటీలుగా రాణిస్తున్నారు.కొంతమంది తల్లిదండ్రుల వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకోగా మరికొందరి మాత్రం ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమ కంటికి ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.

అలా సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదుక్కుపోవడానికి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.చంద్రహాస్ బుల్లితెర నటుడు ప్రభాకర్ కొడుకు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇటీవల తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ అతను నటిస్తున్న సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడించాడు ప్రభాకర్.ఆ తర్వాత అతనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ ట్రోలింగ్స్ జరిగాయి.

Advertisement

ఇక చివరికి రంగం లోకి దిగిన ప్రభాకర్ తన కొడుకు పై ట్రోలింగ్స్ ఆపండి అంటూ సోషల్ మీడియాలో గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు.ఇది ఇలా ఉంటే తనపై ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు చంద్రహాస్.

ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇందులో భాగంగానే చంద్రహాస్‌ వర్కౌట్స్‌, ప్రాక్టీస్‌చేస్తున్నాడు.కాగా అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోలో చంద్రహాస్ ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి కష్టపడుతూ కసరతులు వ్యాయామం చేస్తూ హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు.కాగా వీడియోలపై కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement

తాజా వార్తలు