జుట్టు బాగా రాలుతుందా.. వర్రీ వద్దు పైసా ఖర్చు లేకుండా ఇలా చెక్ పెట్టండి!

హెయిర్ ఫాల్ ( Hair fall )అనేది అందరిలోనూ కామన్ గా ఉండే సమస్య.అయితే అందరిలోనూ ఒకేలా ఉండదు.

కొందరు హెయిర్ ఫాల్ అనేది నార్మల్ గా ఉంటుంది.దీనివల్ల పెద్దగా సమస్య ఏమీ ఉండదు.

కానీ కొందరిలో మాత్రం చాలా హెవీ గా ఉంటుంది.దాంతో జుట్టు కొద్ది రోజుల్లోనే పల్చబడుతుంది.

ఇలాంటివారు జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక మ‌ద‌న పడిపోతుంటారు.కానీ వర్రీ వద్దు.

Advertisement
Powerful Remedy For Controlling Hair Fall! Hair Fall, Stop Hair Fall, Home Remed

పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే చాలా సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి మెత్త‌ని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

Powerful Remedy For Controlling Hair Fall Hair Fall, Stop Hair Fall, Home Remed

ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor oil ) రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Powerful Remedy For Controlling Hair Fall Hair Fall, Stop Hair Fall, Home Remed
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

వారానికి రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.జుట్టుకు మంచి పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

Advertisement

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.

చుండ్రు సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.కాబట్టి జుట్టు బాగా రాలుతుందని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

తాజా వార్తలు