ప‌వ‌న్ కొత్త ఛానెల్ జ‌న‌సేన‌కు ఫ్ల‌స్సా...మైన‌స్సా..!

ప‌వ‌ర్‌స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొత్త న్యూస్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నార‌న్న వార్తలు ఇప్పుడు తెలుగు మీడియా వ‌ర్గాల్లో పెద్ద సెన్షేష‌న్ అయ్యాయి.

ప‌వ‌న్ కొత్త టీవీ ఛానెల్ ఏర్పాటుపై గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

ప్ర‌స్తుతం టీవీ-9 సీఈవోగా ఉన్న ర‌విప్ర‌కాష్‌తో క‌లిసి ప‌వ‌న్ కొత్త న్యూస్ పెడ‌తారంటూ, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగానే ఈ ఛానెల్ ఏర్పాటవుతుంద‌ని టాక్ వ‌స్తోంది.ఇటీవ‌ల ప‌వ‌న్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు ఆడియో ఫంక్ష‌న్‌కు కూడా ర‌విప్ర‌కాష్‌తో పాటు ఎన్టీవీ అధినేత తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి క‌లిసి హాజ‌ర‌య్యారు.

ఇక ర‌విప్ర‌కాష్ టీవీ-9 నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌ని మ‌రొ కొత్త ఛానెల్ ఏర్పాటు చేస్తార‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.ముందుగ ర‌విప్ర‌కాష్‌, ఎన్టీవీ అధినేత న‌రేంద్ర చౌద‌రితో క‌లిసి ఛానెల్ పెడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు మాత్రం ప‌వ‌న్ - ర‌విప్ర‌కాష్ ఛానెల్ తెర‌మీద‌కు వ‌చ్చింది.అయితే ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో లెక్క‌కు మిక్కిలిగా మీడియా ఛానెల్స్ ఉన్నాయి.

Advertisement

చాలా ఛానెల్స్ నెల‌వారి సిబ్బందికి జీతాలు వ‌చ్చే ప‌రిస్థితి కూడా లేదు.ఒక్కో ఛానెల్ ఒక్కో రాజ‌కీయ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తోంది.

ఈ టైంలో ప‌వ‌న్ ఛానెల్ పెడితే అది జ‌న‌సేన ఛానెల్‌గా ముద్ర‌ప‌డిపోతుంది.ఇలాంటి టైంలో క్లీన్ ఇమేజ్‌తో వ‌స్తోన్న జ‌న‌సేన‌కు పార్టీ ముద్ర ఉన్న ఛానెల్ అవ‌స‌ర‌మా ? అన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి.ఇక ప‌వ‌న్ ఛానెల్ వ‌స్తే అది జ‌న‌సేన‌కు డ‌బ్బా ఛానెల్‌గా మారుతుంది.

అప్పుడు ఆ ఛానెల్ జ‌న‌సేన ఛానెల్‌గా ముద్ర‌ప‌డి చాలా వ‌ర్గాల‌కు దూర‌మై స‌రైన ఆద‌ర‌ణ పొంద‌కపోయే ప్ర‌మాదం కూడా ఉంద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.కేవ‌లం న్యూస్ ఛానెల్ వ‌ల్లే ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ వ‌స్తోంద‌ని అనుకోవ‌డం భ్ర‌మే అనుకోవాలి.

ఇందుకు సాక్షి ఛానెలే పెద్ద ఉదాహ‌ర‌ణ‌.మ‌రి తెలుగు మీడియాపై స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఉన్న ప‌వ‌న్ ఛానెల్ విష‌యంలో ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో చూడాలి.

ఏపీ ఎన్నికల ప్రచారానికి మోదీ.. రెండు రోజుల పర్యటన..!!

Advertisement

తాజా వార్తలు