ఏ గుర్తు ఎక్కడ ఉందో... చెప్పండి రాజా !

ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ప్రముఖ సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.

సనత్ నగర్ పరిధిలో ఓటు వేసేందుకు వచ్చిన పోసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ఉదయం నగరంలోని ఎల్లారెడ్డిగూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ పోలింగ్ స్టేషన్ కు వచ్చారు.అక్కడ పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొదట పోలింగ్ కేంద్రంలో వెలుతురు సరిగా లేని కారణంగా ఓటు వేసేందుకు ఇబందిపడ్డారు.ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం బయట మాట్లాడుతూ.ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు ఇబ్బంది పడతారని పోసాని అన్నారు.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు