వినాయక చవితి : మా బొజ్జగణపయ్యకు అత్యంత ప్రియమైన 10 ప్రసాదాలివే!

గణేష్ చతుర్థి( Ganesh Chaturthi ) వస్తుందంటే చాలు, తెలుగునాట మాత్రమే కాకుండా యావత్ భారత దేశంలో సంబరాలు అంబరాన్నంటుతాయి.

ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి సమర్పించాల్సిన ప్రసాదాలను భారతీయ అదపడుచులు ఎంతో నిష్ఠగా, ప్రేమగా చేస్తూ వుంటారు.

అయితే సాధారణంగా మన ఇళ్ళల్లో ఓ రెండు మూడు ఐటమ్స్ తప్ప మిగతా ఆహార పదార్ధాలు కనబడవు.అయితే ఇపుడు మనం ఇక్కడ మన బొజ్జ గణపయ్యకు ఈస్టమైన ఓ పది రకాల ఆహార పదార్ధాలను గురించి మనం తెలుసుకుందాము.

ఈ లిస్టులో మొదటిది “మోదకాలు”( Modak). రుచికరమైన స్వీట్ అంటే గణపతికి అత్యంత ఇష్టమైనదిగా పరిగణిస్తారు.మోదకాల పట్ల ఆయనకున్న ప్రేమకు అతన్ని తరచుగా మోదకప్రియ అని సంబోధిస్తారు కూడా.

ఆయన్ను మెప్పించడానికి మోదకాలను వివిధ రకాల్లో తయారు చేస్తారు కూడా.ఆ తరువాత “మోతీచూర్ లడ్డూ”( Motichoor Laddoo ) గురించి ఇక్కడ చెప్పుకోవాలి.గణేశుడికి ఎప్పుడూ లడ్డూలు అంటే ఎంతో ప్రియం.10 రోజుల పండుగ సమయంలో విగ్రహానికి సమర్పించే తీపిలో మోతీచూర్ లడ్డూ ఒకటి.నువ్వుల లడ్డూ, మోతీచూర్ లడ్డూ మొదలైన వివిధ రకాలుగా వీటిని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

Advertisement

ఈ లిస్టులో మూడవది “పోలెలు”. పోలెలు కూడా గణపతకి ఇష్టమైన స్వీట్ గా చెబుతూ వుంటారు.చాలా ఇళ్లలో గణేశుడికి పోలెలు నైవేద్యంగా సమర్పిస్తారు.

ఇది బెల్లం, మైదాతో చేసిన తీపి ప్రసాదం.అదేవిధంగా “శ్రీఖండ్” ప్రసాదాన్ని కూడా ఆయనకి సమర్పించుకుంటారు భక్తులు.

ఇది గింజలు, ఎండుద్రాక్ష టాపింగ్స్, వడకట్టిన పెరుగుతో తయారు చేసే భారతీయ స్వీట్.ఇక “పాయసం”( Payasam ) గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పాయసం దక్షిణ భారతదేశంలో చేసే సాంప్రదాయ స్వీట్.బెల్లం, కొబ్బరి, యాలకులు కలిపి పాలలో అన్నం వండి దీనిని తయారుచేస్తారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

అదేవిధంగా “అరటిపండు షీర, మేదు వడ” గురించి తెలిసినదే.దక్షిణ భారత సంప్రదాయ ఆహారం ఇది.రుచికరమైన వడ తరచుగా ప్రసాదాల్లో ఇది కూడా అందిస్తారు.ఇక చివరగా “రవ్వ పొంగలి, కోకోనట్ రైస్, సటోరి” గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

Advertisement

మహారాష్ట్రలో అత్యంత ఇష్టపడే పండుగ వంటకాలలో ఇవి వుంటాయి.ఇది ఖోయా లేదా కోవా, నెయ్యి, బేసన్ , పాలతో తయారు చేయబడిన ఒక రుచికరమైన పదార్ధాలు అని చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు