పూనంను ఇంటికి రమ్మన్న నిర్మాత.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకవైపు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి విపరీతంగా చర్చ జరుగుతుంది.శ్రీరెడ్డి చిన్నపాటి ఉద్యమాన్ని నడుపుతుంది.

తెలుగు సినీ ప్రముఖులు అమాయకపు అమ్మాయి జీవితాలతో ఆడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ పలువురు హీరోయిన్స్‌ కూడా ఆరోపిస్తున్నారు.అవకాశాలు కావాలి అంటే తమ బెడ్‌ రూంకు రావాల్సిందే అంటూ కొందరు హీరోలు మరియు నిర్మాత, దర్శకులు అంటున్నారు.

తాజాగా పూనం కౌర్‌కు కూడా అదే పరిస్థితి ఏర్పడటం జరిగిందట.ఈమెకు ఒక నిర్మాత ఛాన్స్‌ ఇస్తాను రమ్మంటి ఇంటికి పిలిచాడట.

తీరా ఆయన ఉద్దేశ్యం ఏంటో పూనంకు తెలిసి షాక్‌ అయ్యిందట.తాజాగా ఈ విషయాన్ని పూనం కౌర్‌ ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్బంగా చెప్పుకొచ్చింది.

Advertisement

ఆమె మాట్లాడుతూ.తాను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒక నిర్మాత నాకు తారస పడ్డాడు.

ఆయన నువ్వు మంచి నటివి, నీకు మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా నీవు ఒక మంచి హీరోయిన్‌గా ఎదుగుతావు అంటూ హామీ ఇచ్చాడు.దాంతో తాను నమ్మేశాను, ఆయన మాటలతో పొంగి పోయాను.

నీకు ఛాన్స్‌ ఇప్పిస్తాను సాయంత్రం ఇంటికి రా అంటూ ఆయన చెప్పాడు.

ఆ నిర్మాత చెప్పినట్లుగానే నేను ఆయన ఇంటికి మా అమ్మను తీసుకుని వెళ్లాను.అమ్మతో వెళ్లడంను గమనించిన ఆ దర్శకుడు చిరాకు పరాకుగా కనిపించాడు.అసు నన్ను పట్టించుకున్నట్లుగా కూడా అనిపించలేదు.

నన్ను పట్టించుకోకుండానే చిరాకు నటిస్తూ నన్ను వెళ్లి పోమని చెప్పించాడు.ఆ తర్వాత నాకు అర్థం అయిన విషయం ఏంటీ అంటే ఆయన ఇంటికి నేను నా తల్లితో వెళ్లడం.

Advertisement

ఒక వేళ నా తల్లితో ఆ పూట వెళ్లకుంటే పరిస్థితి మరోలా ఉండేది అనేది ఆమె అర్థం.తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు హీరోయిన్స్‌ అవసరాలను క్యాష్‌ చేసుకునేందుకు ఫుల్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే నిర్మాత పూనంను వాడేసుకోవాలని భావించి ఉంటాడు.అయితే హీరోయిన్స్‌ కొందరు అవకాశాల కోసం హద్దులు దాటుతున్న కారణంగా, అంతా కూడా అదే విధంగా ఉంటారేమో అని కొందరు నిర్మాతలు ఇలా ప్రవర్తిస్తున్నారు.

అంతా కూడా కఠువుగా ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఉండదు అంటూ కొందరి అభిప్రాయం.

తాజా వార్తలు