జానీని మాస్టర్ అని పిలవొద్దు.. హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో పూనమ్ కౌర్ ఒకరు కాగా జానీ మాస్టర్ ( Johnny master )గురించి పూనమ్ కౌర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు( case of sexual harassment ) నమోదు కాగా మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ వివాదం గురించి జానీ మాస్టర్ ఇప్పటివరకు స్పందించలేదనే సంగతి తెలిసిందే.ఈ ఫిర్యాదు నేపథ్యంలో పూనమ్ కౌర్ జానీని మాస్టర్ అని పిలవద్దని సూచనలు చేశారు.

మాస్టర్ అనే పదానికి కొంచెం గౌరవం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.మరోవైపు చిన్మయి సైతం ఈ వివాదం గురించి స్పందిస్తూ రిపోర్ట్స్ ప్రకారం జానీ మాస్టర్ అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి వేధింపులకు గురి చేశాడని పేర్కొన్నారు.

ఈ కేసులో పోరాడటానికి అమ్మాయికి కావాల్సిన శక్తి చేకూరాలని కోరుకుంటున్నానని చిన్మయి తెలిపారు.

Poonam Kaur Sensational Comments Details Inside Goes Viral In Social Media , Cas
Advertisement
Poonam Kaur Sensational Comments Details Inside Goes Viral In Social Media , Cas

మరోవైపు పోలీసులు యువతిని 3 గంటల పాటు విచారించి ఆ తర్వాత పోలీస్ కేసు నమోదు చేశారని తెలుస్తోంది.సదరు యువతి జానీ మాస్టర్ తో పాటు ఆయన భార్యపై కూడా ఆరోపణలు చేశారు.మరోవైపు జానీ మాస్టర్ పై ఆరోపణల నేపథ్యంలో ఆయన జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని జనసేన సూచనలు చేసింది.

జానీ మాస్టర్ కేసు విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Poonam Kaur Sensational Comments Details Inside Goes Viral In Social Media , Cas

జానీ మాస్టర్ గురించి వినిపిస్తున్న ఆరోపణలు నెటిజన్లను సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయనే చెప్పాలి.జానీ మాస్టర్ పై మూడు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది.కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ వివాదం నుంచి బయటపడకపోతే మాత్రం ఆయన కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని చెప్పవచ్చు .

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు