Poonam Kaur : ఒకరికి హీరో ..మరొకరికి విలన్ అంటూ మరో సంచలనమైన ట్వీట్ వేసిన పూనమ్!

పూనమ్ కౌర్( Poonam Kaur ) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు.

ఈమె సినిమాలలో నటించే హీరోయిన్గా గుర్తింపు పొందడం కంటే సోషల్ మీడియా వేదికగా చేసే వివాదాస్పద పోస్టుల ద్వారానే పాపులర్ అయ్యారు.

తరచూ ఇతరులను ఉద్దేశించి ఈమె పరోక్షంగా పోస్టులు చేస్తూ ఉంటారు అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారో అన్న సందిగ్ధంలో అభిమానులు నేటిజన్స్ ఉండిపోతారు.ఇలా ఎప్పుడూ పరోక్షంగా పోస్టులు చేసే ఈమె ఇటీవల డైరెక్ట్ అటాక్ చేస్తూ వచ్చారు.

గత రెండు రోజుల క్రితం ఈమె డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) ను ఉద్దేశిస్తూ ఏకంగా యూస్ లెస్ ఫెలో అంటూ నేరుగా తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.ఇక ఈ విషయం మర్చిపోకముందే జనసేనకు( Janasena ) సీట్లు కేటాయింపు గురించి అధికారక ప్రకటన ఇవ్వడంతో ఏకంగా ఒక కుక్క ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అలాగే త్రివిక్రమ్ ను టార్గెట్ చేసే పోస్టులు చేస్తున్నారని అందరికీ క్లారిటీ వచ్చింది.

ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా హీరో విలన్ అంటూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉంటున్న ఆమె ఒకరి జీవితంలో హీరో( Hero ) అయిన కొందరు మరొకరి జీవితంలో విలన్( Villain ) కావచ్చని రాసుకొచ్చారు.సామూహిక ప్రయోజనం ప్రకారం వారి చుట్టూ నేరేటివ్ సృష్టిస్తారు అని అంటూ ట్వీట్ చేసారు.

Advertisement

ఇలా తరచూ ఈమె వివాదాస్పద పోస్టులు చేస్తూ ఇలా వార్తలలో నిలుస్తుంటారు.మంచి అందం నటన టాలెంట్ ఉన్నప్పటికీ ఈమె మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు కానీ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తూ మాత్రం వార్తలలో నిలిచారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు