28 కెమెరాలు.. 300 వీడియోలు.. వైరల్ అవుతున్న పూనమ్ కౌర్ సంచలన ట్వీట్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ( Gudlavalleru Engineering College ) ఘటన గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ ఘటన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.

ఈ కేసు విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.అంతేకాకుండా ప్రస్తుతం ఏది నిజం ఏది అబద్దం అన్నది తెలియకుండా మారిపోయింది.

కొన్ని సత్య ప్రచారాలు మరికొన్ని అసత్య ప్రచారాలు జరుగుతుండడంతో ప్రజలకు ఏది అబద్దం ఏది నిజం అనేది తెలుసుకోలేకపోతున్నారు.హాస్టల్లో 28 కెమెరాలు పెట్టారని, 300 మంది అమ్మాయిల వీడియోలు తీశారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది.

కానీ పోలీసు శాఖ నుంచి మాత్రం ఇదంతా ఫేక్ అని, అలాంటిదేమీ జరగలేదని సమాచారం అందుతోంది.అయితే ఈ ఘటన మీద విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu )ఆదేశించారు.ఈ ఘటనను స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

ఒక వేళ నేరం రుజువైతే కఠిన చర్యలు తప్పవని అన్నారు.అర్దరాత్రి హాస్టల్లో కాలేజీ విద్యార్థులు చేసిన ఆందోళనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి.

ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఇలా చేసిందంటూ కొందరు ఆమెను పట్టుకుని చితకబాదారట.ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనను అదుపులోకి తీసుకొచ్చారు.

కొంత మంది అమ్మాయిలు ఈ ఘటన మీద మాట్లాడిన వీడియోలు, ఆడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆ వీడియోలను అబ్బాయిలకు అమ్ముతున్నారంటూ ఒక విద్యార్థిని మాట్లాడింది.దాదాపు 300 మంది అమ్మాయిల వీడియోలున్నట్టుగా తెలుస్తోందంటూ సదరు విద్యార్థినులు చెబుతున్నారు.కానీ ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది.అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియోలు వీడియోలపై నటి పూనమ్ కౌర్( Actress Poonam Kaur ) స్పందించింది.28 కెమెరాలు, 300 వీడియోలు.అసలు ఏపీలో ఏం జరుగుతోందో చూడండి అంటూ బర్కాదత్‌కు ట్యాగ్ చేసింది.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న ఇద్దరు బాలీవుడ్ హీరోలు...
డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం.. వైరల్ వార్తల్లో నిజమెంత?

ఇక అంతకు ముందు ఈ ఘటన గురించి చెబుతూ వైఎస్ షర్మిళను ట్యాగ్ చేసింది.ఇలా ఈ హిడెన్ కెమెరా ఘటన, గర్ల్స్ హాస్టల్ ఘటన మీద పూనమ్ కౌర్ మాత్రం ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూనే ఉంది.

Advertisement

ప్రేమ వ్యవహారంలో వచ్చిన గొడవల వల్లే ఇదంతా పుట్టుకొచ్చిందని, హాస్టల్లో హిడెన్ కెమెరాలు లేవనే వాదన కూడా వినిపిస్తోంది.ప్రభుత్వం ఈ ఘటన మీద విచారణ చేపట్టి అసలు నిజాన్ని వెలికి తీయాల్సి ఉంది.

మరి ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి మరి.

తాజా వార్తలు