Pooja Hegde : గత ఏడాది ఫోటో పంచుకున్న పూజా హెగ్డే.. అదై నాలుగు నెలలు మాత్రమే అంటూ ట్రోల్స్?

మామూలుగా ఎవరైనా సరే ఒకప్పటి ఫోటోలను పంచుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు.ఒకప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాను చూపిస్తూ ఆ ఫోటోలను పంచుకోవడానికి ఇష్టపడతారు.

అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి గతంలో దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు పంచుతూ అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాలని చూస్తూ మురిసిపోతున్నారు.అయితే కొందరు సెలబ్రిటీలు కూడా ఇటువంటివే షేర్ చేస్తూ ఉంటారు.

దీంతో వెంటనే వీరిపై ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.ముఖ్యంగా ఎవరైతే తమకు నచ్చని సెలబ్రెటీ ఉంటారో వెంటనే వారిని బాగా ట్రోల్ చేయడం మొదలు పెడుతూ ఉంటారు.

అయితే తాజాగా ఇటువంటిది ఒక సెలబ్రిటీ కి ఎదురయింది.ఆమె పంచుకున్న ఒకప్పటి ఫోటోకి నెటిజన్స్ రకరకాలుగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.

Advertisement

ఇంతకు ఆమె ఎవరో కాదు పూజా హెగ్డే( పూజా హెగ్డే ).తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో స్టార్ హోదాకు చేరుకుంది.మొదట చిన్న హీరోయిన్ గా చిన్నచిన్న సినిమాలలో అడుగుపెట్టి తొలి నటనతోనే మంచి మార్కులు సంపాదించుకుంది.

అలా తర్వాత స్టార్ హీరోలలో సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఇక అలా వైకుంఠపురంలో సినిమాలో నటించి మరింత క్రేజ్ సంపాదించుకుంది.

ఈ సినిమాతో బుట్ట బొమ్మ( butta bomma )గా అందరి మది దోచుకుంది.ఇక ఈ సినిమా సమయంలో వరుస హిట్ లు అందుకున్న ఈ బ్యూటీని దర్శక నిర్మాతలు బాగా సెంటిమెంటుగా భావించారు.

అంతేకాకుండా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి కూడా బాగా ముందుకు వచ్చారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

అలా ఆ బ్యూటీకి వరుసగా చాలా సినిమాలు వచ్చాయి.కానీ ఈసారి ఆమెకు అదృష్టం వరించలేదు.చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాఫ్ అయ్యి నిరాశపరిచాయి.

Advertisement

దీంతో ఈమెకు ఐరన్ లెగ్( Iron leg ) అనే ముద్ర కూడా పడింది.ఏకంగా స్టార్ హీరోల సినిమాలు ప్లాప్ కావడంతో తమ అభిమానులు చాలా నిరాశ చెందారు.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

బాగా ఫొటో షూట్ లు చేయించుకుంటూ తెగ హడావిడి చేస్తూ ఉంటుంది.ఈమధ్య బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.ఏ ఫొటో షేర్ చేసిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా రెండు ఫోటోలు పంచుకుంది.అయితే ఆ ఫోటోలు పోయిన సంవత్సరం డిసెంబర్ లో దిగినవి అన్నట్లు తెలిపింది.

అంటే ఈ గ్యాప్ లో తను ఇప్పుడు ఇలాగా ఉందని.నాలుగు నెలల కిందట అలా ఉందని పంచుకుంది.

అయితే ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ బాగా కామెంట్లు చేస్తున్నారు.అది కేవలం నాలుగు నెలలు మాత్రమే నాలుగు సంవత్సరాలు అన్నట్లుగా చేస్తున్నావు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

అంటే ఆమె కేవలం 4 నెలలకు మాత్రమే కానీ ఇంతలా చేస్తున్నావు ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు