పూజ హెగ్డే ని మొదటి నుంచి కాపాడుతుంది వాళ్లేనా ? ఇప్పుడు పరిస్థితి ఏంటి ?

మొన్నటి వరకు ఆ హీరోయిన్ ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అవ్వడం ఖాయం.

ఫ్లాప్ హీరోలకి కూడా ఆమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.

అందుకే కాస్త రెమ్యూనరేషన్ ఎక్కువైనా ఆమెను తమ సినిమాల్లో కి తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించేవారు.ఇలా గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే.

నిన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఇక అలాంటి ఈ హాట్ బ్యూటీ కెరీర్ పై ప్రస్తుతం వరుసగా ఫ్లాప్ దెబ్బలు పడుతూ ఉన్నాయి.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హిస్టోరికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాలో నటించింది.

ఇక ఈ సినిమాలో పూజ అందానికి అందరు ఫిదా అయ్యారు.కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

Advertisement

సరే ఒకటి పోతే పోయిందిలే ఇక తలపతి విజయ్ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు పూజా అభిమానులు.కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.

దీంతో ఇక పూజా హెగ్డే ఆశలన్నీ కొన్ని రోజులలో విడుదల కాబోతున్న ఆచార్య పైనే ఉన్నాయన్నది తెలుస్తుంది.ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఇప్పటి వరకు పూజ హెగ్డే మెగా కాంపౌండ్ హీరోలతో నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ కావడం గమనార్హం.2014లో ముకుంద, 2017లో దువ్వాడ జగన్నాథం, 2018లో రంగస్థలం( స్పెషల్ సాంగ్), ఇక 2019లో గద్దల కొండ గణేష్, 2020 లో అల వైకుంఠపురం లో.ఇలా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలలి దాదాపు ఐదు మంది తో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.ఇవన్నీ కూడా మంచి విజయాన్ని సాధించిన సినిమాలే.

ఇక ఇప్పుడు ఆచార్య తో మరోసారి మెగా కాంపౌండ్ ప్లస్ కాబోతుందా అనేది చూడాలి .

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్
Advertisement

తాజా వార్తలు