కాసేపటిలో కేసీఆర్ తో భేటీకానున్న పొన్నాల..!

తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మరికాసేపటిలో భేటీకానున్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు పొన్నాల సమావేశం అవుతారు.

ఈ సమావేశంలో భాగంగా కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.ఈ క్రమంలో పొన్నాలకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసహనంగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నిన్న పొన్నాల నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement