పొంగులేటి చేరికతో కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి వెయిట్‌ పెరగడం ఖాయం

అధికార బీఆర్‌ఎస్( BRS ) బహిష్కరించిన పొంగులేటి మరియు జూపల్లి లు కాంగ్రెస్( Congress ) లో జాయిన్‌ అయ్యేందుకు సిద్ధం అయ్యారు.

గత రెండు నెలలుగా వీరిద్దరు ఏ పార్టీ లో చేరతారు అనే విషయంలో స్పష్టత లేకుండా ఉంది.

ఎట్టకేలకు వీరిద్దరు కూడా కాంగ్రెస్‌ పార్టీ లో చేరేందుకు సిద్ధం అయ్యారు అంటూ క్లారిటీ వచ్చింది.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం తక్కువే ఉంటుంది అంటూ వారు భావించినట్లుగా ఉన్నారు.

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.రేవంత్ రెడ్డి ( Revanth Reddy )స్వయంగా వెళ్లి పొంగులేటిని కలవడంతో పాటు కర్ణాటకలో వచ్చిన ఫలితాలు తెలంగాణ లో రాబోతున్నాయని.

బీజేపీ కంటే కూడా కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ రేవంత్ రెడ్డి వారిని ఒప్పించడంలో సఫలం అయ్యారు.

Ponguleti And Jupally Going To Join In Congress Party , Congress Party, Pongule
Advertisement
Ponguleti And Jupally Going To Join In Congress Party , Congress Party, Pongule

అందుకే వారిద్దరు కూడా కాంగ్రెస్ లో జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఇక ఖమ్మం జిల్లాలో ఉన్న బలం కు తోడు పొంగులేటి( ponguleti ) జాయిన్ అయితే కచ్చితంగా అక్కడ క్లీన్‌ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరి చేరిక వల్ల కాంగ్రెస్ కి పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కనుక రేవంత్‌ రెడ్డికి అధినాయకత్వం వద్ద వెయిట్‌ పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అదే కనుక జరిగితే బీఆర్‌ఎస్ పార్టీ కి కాస్త కష్టం తప్పదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ మరియు కేటీఆర్‌ లను ఢీ కొట్టే సత్తా తనకు ఉంది అంటూ పొంగులేటి ఆ మధ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.మరో ఆరు నెలలో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ హడావుడి మొదలు అయ్యింది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు