ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక పోలింగ్ ముగిసింది.ఎల్లుండి ఓట్లను లెక్కించనున్నారు.

అదే రోజు ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.ఈ ఎన్నికకు మొత్తం 9 వేలకు పైగా కాంగ్రెస్ ప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

వీరిలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు తమ తమ ఓటు హక్కులను వినియోగించుకొన్నారు.పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్ లను రిటర్నింగ్ అధికారులు సీల్ చేశారు.

రేపు ఏఐసీసీ కార్యాలయానికి బ్యాలెట్ బాక్స్ లను తరలించనున్నారు.ఈ అధ్యక్ష రేసులో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి ధరూర్ ఉన్నారు.

Advertisement
Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide