టీడీపీ నేత నారా లోకేశ్ కు పోలీసుల షాక్..!

టీడీపీ నేత నారా లోకేశ్ కు పోలీసులు షాక్ ఇచ్చారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మంత్రి రోజాతో పాటు సీఎం జగన్ ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో లోకేశ్ ను కలిసేందుకు వెళ్లిన పోలీసులను టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేశ్ కు నోటీసులు ఇవ్వాల్సిందేనని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆ నోటీసులను అందుకున్నారు.నిబంధనలను ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేశ్ పై చర్యలు ఎందుకు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement

అయితే పోలీసుల నోటీసులకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అటు టీడీపీ నేతలు సిద్దం అవుతున్నారని తెలుస్తోంది.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు