ఎమ్మెల్యే రాజాసింగ్‎కు మరోసారి పోలీసుల నోటీసులు..!

హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‎కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు.ముంబై ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు అందించారు.

హైకోర్టు షరతులను సైతం ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ మేరకు వ్యాఖ్యలపై రెండు రోజుల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ సమాధానం ఇవ్వాలని మంగళ్ హాట్ పోలీసులు స్పష్టం చేశారు.

లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు