Lasya Nanditha Car Accident : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు ప్రమాదంపై పోలీస్ కేసు నమోదు..!!

రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత( BRS MLA Lasya Nanditha ) అంతిమయాత్రకి పార్టీ నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.

గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం లాస్య నందిత భౌతికకాయాన్ని కార్ఖానాలోని నివాసానికి తరలించారు.

ఆ తర్వాత ఈస్ట్ మారేడుపల్లి లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ క్రమంలో అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పాల్గొనడం జరిగింది.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.లాస్య నందిత భౌతికకాయానికి కేసీఆర్ తో( KCR ) పాటు చాలామంది బీఆర్ఎస్ నాయకులు.

సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఇతర పార్టీలకు చెందిన వాళ్లు నివాళులర్పించారు.

Advertisement

కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు( Patancheru Police ) కీలక విషయాలు వెల్లడించారు.నిన్న లాస్య నందిత సదాశివపేటకు వెళ్లి వచ్చారు.శుక్రవారం ఉదయం అల్పాహారం కోసం బయటకు వెళ్లారు.

శామీర్ పేట వద్ద లాస్య నందిత కారు ఓఆర్ఆర్ పైకి ఎక్కింది.సుల్తాన్ పూర్ వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ ను కారు ఢీకొట్టింది.

ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయి కారు రెయిలింగ్ నీ ఢీకొంది అని వెల్లడించారు.

ఇదిలాఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఆమె సోదరి నివేదిత( Niveditha ) ఫిర్యాదుతో చర్యలకు దిగారు.ప్రమాద సమయంలో కారు నడుపుతున్న ఆకాశ్ పై( Akash ) ఐపీసీ 304 ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.ఉదయం 5.15 గంటలకు ఆకాశ్ కాల్ చేసినట్లు నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయని చెప్పాడని.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?

వెళ్లి చూసేసరికి కారు నుజ్జునుజ్జెనట్లు లాస్య సోదరి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు