పోలవరం డౌటే.. జగన్ చేతులెత్తేశారా ?

ఏపీలో అసలు జవాబే లేని ప్రశ్న ఏదైనా ఉందా ? అంటే అది పోలవరం ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సంధిగ్డతే అని చెప్పాలి.

ఏళ్ళు గడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కావడం లేదు.

ఎలక్షన్స్ ముందు పోలవరం పూర్తి చేయడమే మా ప్రధాన కర్తవ్యం అని చెప్పే నాయకులు.తీర అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ప్రాజెక్ట్ కు సంబంధించిన ఊసే ఎత్తడం లేదు.

రాష్ట్ర విభజన తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu, ) పోలవరం ప్రాజెక్ట్ పనులలో కొంత వేగం చూపించారు.ప్రాజెక్ట్ పనులు ఎంతవరుకు వచ్చాయి అనే విషయాలను ఎప్పటికప్పుడూ ప్రజలు వివరించే వారు.

కానీ 2019 తరువాత టీడీపీ ప్రభుత్వం( TDP party ) పోవడం.వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది.

Advertisement

ఎన్నికల ముందు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత మాదే అని చెప్పిన వైఎస్ జగన్.అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్ట్ .ఎప్పుడు పూర్తి అవుతుందనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు గతంలో అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడూ 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కుండ బద్దలు కొట్టారు.ఆ తరువాత తూచ్ అన్నారు మళ్ళీ 2022 లో పూర్తి చేస్తామని చెప్పారు కానీ అది జరగలేదు.

ఆ తరువాత ఆయన ఏకంగా మంత్రి పదవి నుంచే తప్పుకున్నారు.ఇక ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు అసలు పోలవరం ప్రస్తావనే లేకుండా ఉన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ గూర్చి ఎప్పుడు ప్రశ్నించిన దాటవేసే ప్రయత్నం చేస్తున్నారే తప్పా.ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుమనే దానిపై అసలు క్లారిటీ ఇవ్వడం లేదు.ఇక తాజాగా అసలు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని బాంబ్ పేల్చారు అంబటి.దీంతో అసలు వైసీపీ( YCP party ) ప్రభుత్వానికి పోలవరం పూర్తి చేయాలనే ఉద్దేశం ఉందా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.2020 లో వచ్చిన వరదల కారణంగా డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, కాపర్ డ్యామ్ ను పూర్తి చేసిన తరువాతే డయా ఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చిన అంబటి.ఆ కారణంగా పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని స్పష్టం చేశారు.

మొత్తానికి మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu )వ్యాఖ్యలను బట్టి చూస్తే పోలవరం విషయంలో జగన్ సర్కార్ చేతులెత్తేసినట్లే తెలుస్తోంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు