ఇరాన్ దేశంలో ఆడపిల్లలపై విష ప్రయోగం.. అంతమంది అమ్మాయిలకు ప్రత్యక్ష నరకం!

రోజుల్లో జెండర్ ఈక్వాలిటీకి ఎవరైనా సరే ప్రాధాన్యత ఇవ్వాల్సిందే.ఆడవారికి మగవారి పొందే అన్ని హక్కులను కల్పించాలి.

చదువులు పనులకు వారిని దూరం చేస్తే రాక్షసత్వమే అనిపించుకుంటుంది.ఇలాంటివి భారతదేశంలో కనిపించకపోయినా ఇస్లామిక్‌ దేశాల్లో బాగా కనిపిస్తుంటాయి.

ఇరాన్‌లో ఇప్పుడు అచ్చంగా అలాంటిదే జరుగుతోంది.కేవలం విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని విష వాయువుల ప్రయోగానికి పాల్పడుతున్నారు.

ఇదంతా ఎవరు చేస్తున్నారు, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరనేది మాత్రం అంతుచిక్కడం లేదు.మరోవైపు దుండగులు చేస్తున్న అరాచకాలపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఎప్పుడేం జరుగుతోందో తెలియక వణికిపోతున్నారు.విష వాయువుల ప్రయోగాల గుట్టును రట్టు చేస్తామని, దోషులను కచ్చితంగా శిక్షిస్తామని ఇరాన్‌ ప్రభుత్వం హామీ ఇవ్వడం కొంత ఊరట కలిగిస్తోంది.

ఇరాన్‌లో 1979లో జరిగిన ఇస్లామిక్‌ విప్లవం తర్వాత మహిళలు స్వేచ్ఛాగా గాలి పీల్చుకుంటున్నారు.బాలికలు, యువతులపై ఆంక్షలన్నీ దాదాపుగా తొలగిపోయాయి.స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి నిర్భయంగా చదువుకుంటున్నారు.

పక్కనే ఉన్న అఫ్గానిస్తాన్‌ లాంటి పరిస్థితులు ప్రస్తుతం ఇరాన్‌లో లేవు.బాలికల విద్యాభ్యాసాన్ని, మహిళలు ఉద్యోగాలకు వెళ్లడాన్ని తాలిబన్‌ ప్రభు త్వం నిషేధించడం పట్ల ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాంటిది ఇప్పుడు ఇరాన్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.తలపై బుర్ఖా సక్రమంగా ధరించనందుకు 22 ఏళ్ల మహసా అమీనీ అనే యువతిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరాన్‌ నైతిక పోలీసులు బంధించి, చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే ఇవి రాత్రిపూట తింటే చాలు..!

మూడు రోజులపాటు కోమాలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన అమీనీ సెప్టెంబర్‌ 16న మృతి చెందింది.ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలో ఆగ్రహం వెల్లువెత్తింది.

Advertisement

కాగా ఇప్పుడు బాలికల చదువులకు ఇరాన్లో కష్టం వచ్చింది.ఆడపిల్లలు చదువుకోకుండా ఇరాన్‌లో 30 ప్రావిన్స్‌లోని 21 ప్రావిన్స్‌ల్లో 50కి పైగా పాఠశాలల్లో విష వాయువులు ప్రయోగించారు.కుళ్లిన నారింజ పండ్ల వాసన, క్లోరిన్‌ వాసన, టాయ్‌లెట్లు శుభ్రం చేసుకొనే రసాయనాల వాసనతో ఈ విషవాయువులు ఉంటాయి.

వీటి వల్ల చాలామంది అనారోగ్యాల పాలై ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.కాగా ఇరాన్‌ పాఠశాలల్లో విష వాయువుల ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించాయి.ఈ నేపథ్యంలో బాలికలపై విష వాయువులు ప్రయోగించడం క్షమించరాని నేరమని ఇరాన్‌ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు.

అలానే బాధితులను శిక్షిస్తామన్నారు.

తాజా వార్తలు