Huawei Company : హువావే నుంచి పాకెట్ ఎస్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్.. దాని ఫీచర్లు ఇవే..

హువావే కంపెనీ తాజాగా తన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ హువావే పాకెట్ ఎస్ను చైనాలో రిలీజ్ చేసింది.ఈ మొబైల్ హార్మొనీ ఓఎస్ 3, స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో వర్క్ అవుతుంది.

ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు.అలానే 40-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఆఫర్ చేశారు.40W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ ఫోల్డబుల్ ఫోన్ 4,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అందిస్తుంది.చైనాలో హువావే పాకెట్ S ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్‌ విండో ఇప్పటికే స్టార్ట్ అయింది.

నవంబర్ 10 నుంచి ఈ మొబైల్ డెలివరీలు ప్రారంభమవుతాయి.హువావే పాకెట్ S ఫోన్ 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ 5,988 (సుమారు రూ.67,900) యెన్లుగా కంపెనీ నిర్ణయించింది.8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ 6,488 (దాదాపు రూ.73,600) యెన్ల ప్రైస్ ట్యాగ్‌తో వస్తుంది.8జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ 7,488 (దాదాపు రూ.84,900) యెన్లగా ఉంటుంది.ఫ్రాస్ట్ సిల్వర్, ఐస్ క్రిస్టల్ బ్లూ, మింట్ గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్, ప్రింరోస్ గోల్డ్, సకురా పింక్ వంటి రంగులలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇందులో 340 x 340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.04-అంగుళాల ఓఎల్ఈడీ ఔటర్ డిస్‌ప్లే ఉంది.ఈ మొబైల్‌లో 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 10.7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేశారు.ఇది ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement