మన్ కీ బాత్‎లో ఎన్టీఆర్ గురించి ప్రధాని వ్యాఖ్యలు

దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు.మన్ కీ బాత్ లో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

సినీ ఇండస్ట్రీలో, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారని మోదీ అన్నారు.తెలుగు తెరపై ఎన్నో పాత్రలలో ఆయన జీవించారని తెలిపారు.

నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ బలంగా ప్రభావం చూపారన్నారు.ఈ క్రమంలోనే కోట్లాది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ స్థానం సంపాదించారని మోదీ కొనియాడారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు వినమ్రపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)