మోడీకి దక్షిణ కొరియా శాంతి బహుమతి!

ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటన నిన్న స్టార్ట్ అయ్యింది.

దక్షిణ కొరియా దేశంతో స్నేహ పూర్వక సంబంధాలలో భాగంగా ఆదేశం వెళ్ళిన మోడీకి రాజధాని సియోల్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఆర్ధిక ఒప్పందాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా వుంటే ఈ కార్యక్రమాలలో భాగంగా దక్షిణ కొరియా శాంతి బహుమతిని భారత ప్రధాని మోడీకి ఇవ్వాలని నిర్ణయించుకుంది.

అంతర్జాతీయ సహకారం, ప్రపంచ అభివృద్ధి, మానవ సంబంధాలు పెంచడంలో మోడీ చేస్తున్న కృషిక్కి దక్షిణ కొరియా ఈ శాంతి బహుమతికి ప్రకటించినట్లు తెలుస్తుంది.దక్షిణ కొరియా అధ్యక్షుడు చేతుల మీద మోడీ ఈ శాంతి బహుమతిని అందుకునే అవకాశం వున్నట్లు తెలుస్తుంది.

ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలపై చర్చించే అవకాశం వుంది.మరి ఈ పర్యటనలో దక్షిణ కొరియాతో ఎలాంటి వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు మోడీ చేసుకుంటారు అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)