చేతులు జోడించి ప్రాధేయపడుతున్న లిక్కర్ కింగ్

వేల కోట్లు భారత బ్యాంకులలో టోకరా పెట్టి విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే.

అయితే మొన్నటివరకు ధీమా గా వ్యవహరించిన ఆయన తీరులో ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది.

భారతీయ బ్యాంకులకు రుణపడ్డా మొత్తంలో 100 శాతం అసలుకు తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.బ్యాంకులు తనకు ఇచ్చిన అసలు రుణాలను తిరిగి తీసుకోవాలి అంటూ చేతులు జోడించి మరి ప్రాధేయపడుతున్నారు.

భారతీయ బ్యాంకులలో దాదాపు 3000 కోట్లకు పైగా టోకరా పెట్టి బ్రిటన్ కు పారిపోవడం తో తిరిగి భారత్ కు రప్పించుకు భారత గవర్నమెంట్ చేసిన ప్రయ్నతాలు ఫలించడం తో మాల్యాను ను భారత్ కు అప్పగించాలి అంటూ అక్కడి కోర్టు తీర్పు కూడా వెల్లడించింది.మాల్యా కేసులో ఏడాదిపాటు విచారణ జరిపిన లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం అతడిని భారత్‌కు అప్పగించాలని 2018 డిసెంబరులో కీలక తీర్పు వెల్లడించింది.

అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ మాల్యా బ్రిటిష్ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా దానిపై విచారణ నిన్నటితో పూర్తి అయ్యింది.ఈ క్రమంలో బ్యాంకుల ఫిర్యాదుతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తన ఆస్తులను అటాచ్‌ చేసిందని, దయచేసి మీ డబ్బులు మీరు తీసుకోవాలన్నారు మాల్యా.

Advertisement

సీబీఐ, ఈడీ అకారణంగా తనపై చర్యలు తీసుకుంటున్నాయని మాల్యా ఆరోపించారు.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి
Advertisement

తాజా వార్తలు