నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది... వైరల్ అవుతున్న వీడియో!

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు దర్శనం ఇస్తూ ఉంటాయి.

ఎన్ని రకాల వీడియోలు కనిపించినా విన్యాసాలకు సంబంధించిన వీడియోలు ప్రముఖంగా ఇక్కడ వైరల్ అవుతుంటాయి.

అలాంటి వీడియోలను చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి ఆనందిస్తారు.అయితే అలాంటి సాహసాలకు సంబందించిన దృశ్యాలలో ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగితే అవి మరింత వైరల్ అవుతుంటాయి.

తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఎంత ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్ అయినా ఒక్కో సమయంలో అదుపు తప్పి అభాసుపాలవుతుంటారు.

తాము ఎంతో నైపుణ్యంగా చేసే సంట్స్ సమయంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.తత్ఫలితంగా గాయాలు పాలవుతారు.

Advertisement

ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఒక యువకుడు నిప్పుతో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు.వేదికపై ఫైర్‌తో విన్యాసాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాడు.

ఇక అతడు చేసే విన్యాసాలు చూసి జనాలు చప్పట్లు కొడుతున్నారు.దీంతో ఆ యువకుడు మరింత ఉత్సాహంగా తెచ్చిపోయి మరీ సరికొత్త విన్యాసాలను చేయాలని భావించాడు.

ఆ యువకుడు ఒక అగ్గి బరాటా తీస్కుని పైకి ఎగరవేసి అది తన నిక్కరు లోపలినుండి బయటికి వచ్చే విధంగా విన్యాసం చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఓ రెండు మూడు సార్లు అలా చేసి సక్సెస్ అయ్యాడు.కానీ మూడవ సారి మాత్రం తన పప్పులు ఉడకలేదు.

అలా విన్యాసం చేసే క్రమంలో తన నిక్కరుకి మంట అంటుకోవడంతో బెంబేలెత్తిపోయారు.ఆ మంట ఎంతకీ రాకపోవడంతో పేంట్ విప్పివేశాడు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఒకేసారి ఇద్దరు డాక్టర్లతో అఫైర్ పెట్టుకున్న చైనీస్ నర్స్.. చివరికి..?

ఆ దృశ్యాన్ని చూసిన చూపరులు తెగ నవ్వుకున్నారు.

Advertisement

తాజా వార్తలు